Tollywood 2023: ఏడాది అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్ ఎవరంటే..?

ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ లో హవా కొనసాగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా రష్మిక మందన్న యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు సమంత కూడా సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. అలాగే నయనతార ఇటీవల జవాన్ మూవీలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విజయాన్ని అందుకుంది నయనతార. ఇక త్రిష , కీర్తి సురేష్ కూడా మరొకవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలోనే టాప్ పొజిషన్లో కొనసాగుతున్న వీరు పారితోషకం విషయంలో కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్పవచ్చు. మరి ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు ఎవరు ఎక్కువ పారితోషకం తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం..

సమంత.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత ఇటీవలే ఖుషితో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. అయితే ఆరోగ్య సమస్య కారణంగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈమె త్వరలోనే సిటాడెల్ , చెన్నై స్టోరీస్ లతో మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇకపోతే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

నయనతార.. తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇటీవలే జవాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈమె ఈ సినిమాకి ఏకంగా రూ.10 కోట్ల రేమ్యునరేషన్ తీసుకుంది. ఇక ఇప్పుడు తదుపరి చిత్రాలకు ఇంతకుమించి పారితోషకం తీసుకోబోతుందని సమాచారం..

- Advertisement -

త్రిష.. దాదాపు 21 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో అగ్రనాయికగా ఒక వెలుగు వెలుగుతున్న ఈమె నాలుగు పదుల వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .5 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది.

తమన్నా.. మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గత 17 సంవత్సరాలుగా సౌత్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.7 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. ఇక తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ అయింది.

కీర్తి సురేష్.. ఈమె కూడా కోలీవుడ్ , టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .3కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు