Shruti Haasan: ఈ హీరోయిన్ కి సడన్ గా ఇన్ని ఆఫర్లు ఎందుకో? ఏంటా సీక్రెట్?

సౌత్ బ్యూటీ శృతిహాసన్ కు ఉన్నట్టుండి ఆఫర్లు పెరిగాయి. మరి ఈ రేంజ్ లో శృతికి ఆఫర్లు వెలువల రావడానికి కారణం ఏంటి? నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈమెలో ఉన్న ఆ సీక్రెట్ ఏంటి? అంటే…

మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతిహాసన్ గత కొంతకాలం నుంచి ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తుంది. ఈ బ్యూటీ హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ తో సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ అంతా కాదు. ఆమెపై ఏ రేంజ్ లో విమర్శలు వెల్లువెత్తుతాయో, అదే విధంగా అభిమానులను ఆకట్టుకుంటుంది కూడా. చాలా కాలం నుంచి ఈ బ్యూటీ పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని శృతి అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

అందం, అభినయం ఉన్న శృతిహాసన్ పాన్ హీరోయిన్ కల నెరవేరడానికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ హిట్ అయితే శృతిహాసన్ రేంజ్ మారిపోవడం ఖాయం. కానీ పరిస్థితి చూస్తుంటే అంతదాకా ఆగాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

- Advertisement -

ఆ సినిమా రిలీజ్ కి ముందే శృతిహాసన్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో ఆఫర్లను రాబట్టుకుంటుంది. రీసెంట్గా అడవి శేషు తో కలిసి ఈ బ్యూటీ పార్లర్ ఇండియా హిందీ తెలుగు ద్విభాషా ప్రాజెక్ట్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ బ్యూటీ “కేజీఎఫ్” స్టార్ యష్ తో రొమాన్స్ చేయబోతున్నట్టు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఆమెకు ఇలా వరుస ఆఫర్లు రావడానికి కారణం ఏంటి? నిజానికి ఈ బ్యూటీ నటించిన ఇటీవల సినిమాలేవి పెద్దగా ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి.

అయినప్పటికీ చిత్ర నిర్మాతలు శృతిహాసన్ ను తమ సినిమాల్లో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. రీసెంట్ హిట్ మూవీ “హాయ్ నాన్న”లో కూడా శృతిహాసన్ గెస్ట్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్ లో ఆడి పాడింది. కానీ సినిమాలో ఆమె అతిథి పాత్ర పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగిన కూడా మేకర్స్ ఈ హీరోయిన్ పట్ల ఆసక్తిని కనబరచడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శృతిహాసన్ ను చూసి ఆ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా అని మనసులోనే అనుకుంటున్నారేమో ప్రస్తుతం ఆఫర్లు లేని హీరోయిన్లు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు