VarunLav: పెళ్లి కాకముందే లావణ్య త్రిపాఠికి వరుణ్ చుక్కలు చూపిస్తున్నాడుగా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం ఈనెల 9న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్ గా జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఈ నెల 9న ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థంతో ఒకటయ్యారు. మెగా ఫ్యామిలీ లో ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప ఎవరూ కూడా హీరోయిన్లను పెళ్లి చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే బద్రి సినిమాలో నటించిన రేణు దేశాయ్ తో ప్రేమలో పడి కొన్నాళ్లు సహజీవనం చేశారు.

ఓ కొడుకు పుట్టిన తర్వాతే తనని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. కొన్ని మనస్పర్ధల కారణంతో వీరు విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు ప్రేమించుకొని, పెద్దలను ఒప్పించి తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోనున్నారు. నిశ్చితార్థం తర్వాత వీరు విదేశాలకు విహారయాత్రకు సైతం వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా లావణ్య కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆ వీడియోలో లావణ్య ఉదయాన్నే నిద్ర లేచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని షూటింగ్ కి హాజరైంది. ఈ వీడియో చూస్తే లావణ్య చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. అలా ఈ వీడియో వైరల్ గా మారడంతో పెళ్లికాకముందే లావణ్యను బాగా ఇబ్బంది పెడుతున్నావు వరుణ్, పెళ్లయ్యాకనైనా బాగా చూసుకో అని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు