Nikhil: నిఖిల్ ‘స్పై’ సినిమా రిలీజ్ ఎప్పుడో.. !

కార్తీకేయ2 సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు పొందిన యంగ్ హీరో నిఖిల్, ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ ను అంతగా వాడుకుంటున్నట్లు కనిపించట్లేదు. అప్పట్లో ఎడిటర్ గ్యారీ డైరెక్షన్లో నిఖిల్ హీరోగా చేస్తున్న సినిమా ‘స్పై’ కి సంబంధించి విడుదలైన టీజర్ మినహా తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేక ఆగిపోయిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి అభిమానుల్లో. నిఖిల్ కెరీర్ మొదటిసారి స్పై క్యారెక్టర్ లో నటించిన సినిమా కావటంతో ఈ సినిమా టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది అప్పట్లో. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన ఈ సినిమాపై తరువాత ఎటువంటి అప్డేట్ లేకపోవటం వల్ల సినిమా ఉందన్న విషయం చాలా మంది మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది.

టీజర్ మినహా ఎలాంటి అప్డేట్ లేని ఈ సినిమా బడ్జెట్ కారణాలతో ఏమైనా ఆపేసారా అన్న సందేహం కూడా వస్తోందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా కొంత భాగం షూటింగ్ ఫారిన్ లొకేషన్లలో జరిగిందని సమాచారం. అన్నీ అనుకున్న రీతిలో జరిగి ఈ సమ్మర్ కి సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకొని ఉండుంటే గనక హీరో నిఖిల్ కి మరో పాన్ ఇండియా హిట్ దక్కే ఛాన్స్ ఉండేది. అయితే కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఆచి తూచి కథలు ఎంచుకోవటం ఇప్పుడు నిఖిల్ కెరీర్ కు కీలకం. నిఖిల్ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది.

ఇదిలా ఉంటే అఖిల్ ఏజెంట్ సినిమా, స్పై సినిమా ఒకే జానర్ అవటం కూడా ఈ సినిమా విషయంలో జాప్యానికి ఒక కారణం అని అంటున్నారు. తన సినిమాల పట్ల జాగ్రత్తగా ఉంటున్న నిఖిల్ ఈ ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న ఏజెంట్ సినిమా రిజల్ట్ చూసి తన సినిమాలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుందేమో అన్న భావనలో ఉండటం కూడా స్పై సినిమా ఆలస్యం అవటానికి కారణం అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు