Prabhas: హృతిక్ – ప్రభాస్ కాంబినేషన్ ఏమైంది..?

బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్, ఆ తరువాత వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నాడు. అయితే సాహో, రాధేశ్యామ్ సినిమాలు నిరాశపరచడంతో డార్లింగ్ ఫాన్స్ అయోమయంలో పడ్డారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు పేలవమైన గ్రాఫిక్స్ క్వాలిటీతో వచ్చిన ఆదిపురుష్ ట్రైలర్ మరింత నిరాశ పరుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ను అయోమయానికి గురిచేసే మరో వార్త ఒకటి వచ్చింది. అదే, హృతిక్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ వార్ 2 సినిమా ఉండబోతోందన్న వార్త. గతంలో మైత్రి మూవీస్ బ్యానర్ పై హృతిక్ ప్రభాస్ ల కాంబినేషన్లో సినిమా ఉండబోతోంది అంటూ న్యూస్ సినీవర్గాల్లో చక్కర్లు కొట్టింది.

ఇప్పుడు యష్ రాజ్ ఫిలిమ్స్ నుండి ఈ ప్రకటన రావటంతో ఇక ప్రభాస్, హృతిక్ ల కాంబినేషన్లో సినిమా ఇప్పట్లో ఉండదు అన్న క్లారిటీ వచ్చేసింది. అయితే మైత్రి మూవీస్ వారు ప్రభాస్ తో సినిమా కమిట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ప్రభాస్ కోసం ఎలాంటి ప్రాజెక్ట్ సెట్ చేయబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉండగా వార్ సినిమా పార్ట్ 1 కు దర్శకత్వం వహించిన సిద్దార్థ్ ఆనంద్ కాకుండా అయ్యన్ ముఖర్జీ ని వార్ 2 కి దర్శకుడిగా ప్రకటించింది.

ఈ క్రమంలో మైత్రి మూవీస్ బ్యానర్ పై సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ప్రభాస్, హృతిక్ కాంబినేషన్లో ప్రాజెక్ట్ కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా యష్ రాజ్ ఫిలిమ్స్ నుండి హఠాత్తుగా ఈ ప్రకటన రావటం ఆడియెన్స్ కే కాక, అటు డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ కు మైత్రి మూవీస్ కు కూడా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. హృతిక్ ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్ ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థకు ఏమొచ్చింది అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు