Nani: ఆంధ్రులకు దసరా నచ్చలేదా..?

నాని, కీర్తి సురేష్ ల కాంబినేషన్లో డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన దసరా దేశవ్యాప్తంగా చేస్తున్న సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాని కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా 92కోట్ల గ్రాస్ వాసులు 100కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఐపీఎల్ ధాటికి కలెక్షన్ల స్పీడ్ కొద్దిగా తగ్గినప్పటికీ ఈ వీకెండ్ ముగిసే సరికి 100కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే, ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో దసరా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవన్నది టాక్. మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఆ జోరు కంటిన్యూ అవ్వలేదని తెలుస్తోంది. దసరా సినిమాలో పక్కా తెలంగాణ స్లాంగ్ ఉండటమే ఇందుకు కారణం అన్న వాదన వినిపిస్తోంది.

నిజానికి గతంలో తెలంగాణ స్లాంగ్ తో వచ్చిన సినిమాలు చాలానే ఆంధ్రాలో కూడా బాగా ఆడాయి. అయితే దసరా సినిమాలో కొన్ని సీన్లలో నాని డైలాగ్స్ పక్కా తెలంగాణ స్లాంగ్ లో ఉండటం వల్ల కొంతమంది తెలంగాణ ప్రేక్షకులకు కూడా అర్థం కాలేదని అంటున్నారు. ఆంధ్ర ప్రాంతంలో కాస్తో కూస్తో కలెక్షన్లు వస్తున్నప్పటికి, రాయలసీమ ప్రాంతంలో మాత్రం కలెక్షన్లు చాలా డల్ గా ఉన్నాయని అంటున్నారు.

సబ్జెక్టు నచ్చక సినిమాలకు కలెక్షన్లు పైపోవటం చూసాం కానీ, స్లాంగ్ అర్థం కాక సినిమాకు కలెక్షన్లు పడిపోవటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. గతంలో కోటా లాంటి యాక్టర్లు తెలంగాణ స్లాంగ్ లో చాలా క్యారెక్టర్లు చేసినప్పటికీ వారు నెమ్మదిగా డైలాగ్స్ పలకటం వల్ల ఇతర ప్రాంత ప్రేక్షకులకు కూడా అవి బాగా అర్థం అయ్యేవి. అయితే దసరా సినిమాలో నాని కొన్ని సీన్లలో మరీ స్పీడ్ గా డైలాగ్స్ చెప్పటం వల్లే ఆంధ్ర ప్రేక్షకులు వాటిని క్యాచ్ చేయలేకపోయారని అంటున్నారు. ఏదేమైనా ఇక మీదట ఇలాంటి స్లాంగ్ ప్రధానంగా సాగే సినిమాల్లో ఈ సమస్య ఉత్పన్నం అవకుండా చూసుకోగలగాలి మేకర్స్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు