Varun Dhawan: ఆమె అంటే పిచ్చి.. అందుకే వెంబడించాను – వరుణ్ ధావన్..!

ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ హీరో అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే.. ఎందుకంటే ఎక్కువగా సౌత్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న వరుణ్ ధావన్.. ఇప్పటికే సమంత , కీర్తి సురేష్ వంటి హీరోయిన్లతో కలిసి సినిమాలు చేస్తున్నారు. ఇక అలాంటి ఈ హీరో ఒక హీరోయిన్ చెల్లెల్ని సీక్రెట్ గా వెంబడించారట. అయితే ఎందుకలా చేశారు ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలు ఎవరు అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు విషయంలోకి వెళితే బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా చలామణి అవుతున్న కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొన్ని నెలలుగా తెలుగు సినిమాలకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తూ ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. మొన్నా మధ్య వచ్చిన లైగర్ సినిమాని హిందీ లో ప్రొడ్యూస్ చేసింది కూడా ఈయనే. అలాంటి కరణ్ జోహార్ హోస్ట్ గా మారి కాఫీ విత్ కరణ్ అనే షోకి పనిచేస్తున్న విషయం తెలిసిందే . ఈ షోలో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా చాలామందిని ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాలను కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాదు సెలబ్రిటీల పైన చేసే కామెంట్ల వల్ల అప్పుడప్పుడు విమర్శల పాలవుతూ ఉంటారు.

ఇకపోతే ఇప్పటికే ఈ షో కి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ షో కి వెళ్ళిన వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టడంలో కరణ్ జోహార్ దిట్ట అని చెప్పాలి. అందుకే ఇప్పటివరకు తన విడాకుల గురించి ఎక్కడ స్పందించని సమంత.. మొదటిసారి ఈ షోలో స్పందించింది. అలాగే సెలబ్రిటీల మధ్య ఉన్న రిలేషన్స్ ని కూడా ఈయన బట్టబయలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ షో కి బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా హాజరయ్యారు.

- Advertisement -

ఇక ఈ షోలో కియారా అద్వానీతో ప్రేమ, పరిచయం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని సిద్దార్థ్ మల్హోత్రా వెల్లడించారు. అలాగే వరుణ్ ధావన్ కూడా ఇంస్టాగ్రామ్ లో ఏ హీరోయిన్ చెల్లిని మీరు స్టాకింగ్ చేశారు అని అడగగా.. వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ఆయేషా శర్మను నేను రహస్యంగా వెంబడించాను. ఎందుకంటే ఆమె ఫిట్నెస్ అంటే నాకు చాలా పిచ్చి.. అందుకే ఆమెను రహస్యంగా ఫాలో అవ్వాల్సి వచ్చింది అంటూ వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు