Balakrishna: బాలయ్య పై పొలిటికల్ కుట్ర.. అందుకే రూమర్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో సీనియర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..బాలకృష్ణ బయటికి గంభీరంగా కనిపించినా.. ఆయన మంచి మనసుకి ఆయనతో పనిచేసిన ఎంతోమంది చెప్పే మాటలు నిదర్శనమని చెప్పవచ్చు. అలాంటి బాలకృష్ణపై తాజాగా ఒక తమిళ నటి విచిత్ర చేసిన సంచలన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇకపోతే ఏపీలో ఎన్నికలకు ముందు విచిత్ర ఆరోపణలు చేయడం వెనుక బాలయ్యను రాజకీయంగా తొక్కేయాలని కుట్రలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇకపోతే నటి విచిత్ర అటు బాలయ్య పేరు కానీ ఇటు సినిమా పేరు కానీ ప్రస్తావించలేదు. కానీ ఆమె తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా.. భలేవాడివి బాసూ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు. ఇకపోతే ఈమె చేసిన ఆరోపణలు చూస్తుంటే బాలయ్య తనను లైంగికంగా వేధించారు అంటూ ఆమె చేసిన కామెంట్లు సర్వత్ర పలు సంచలనాలకు దారి తీస్తోంది. ఇకపోతే నిజంగా బాలయ్య తప్పు చేసి ఉంటే అప్పట్లోనే మీడియా ముందుకు వచ్చి విచిత్ర ఆరోపణలు చేసి ఉంటే బాగుండేది. దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇలా ఆరోపణలు చేస్తే ప్రూవ్ చేయడం కూడా సులువు కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆమె ఇప్పుడు ఇలా ఆరోపణలు చేస్తోంది.

మరి విచిత్ర నిజంగానే బాలయ్య తప్పు చేసి ఉంటే ఇప్పటికైనా తప్పు చేసింది ఆయనో కాదో క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వాస్తవానికి బాలయ్యతో పదుల సంఖ్యలో హీరోయిన్లు పనిచేశారు. రాధిక ఆప్టే కూడా ఒక సౌత్ హీరోపై ఆరోపణలు చేయగా ఆ సమయంలో కూడా బాలయ్య పేరే ప్రస్తావన లోకి వచ్చి ఆయనను చాలామంది విమర్శించారు. అంతేకాదు అదే సమయంలో బాలయ్య పై రాధిక చేసిన ఆరోపణలు నిజమైతే ఆయనతో మళ్ళీ సినిమా ఎందుకు చేసిందని చాలామంది ప్రశ్నించారు కూడా.. ఇక ప్రస్తుతం రాజకీయంగానే ఆయనను తొక్కేయాలని ఈ క్రమంలోనే ఆయనపై ఇలా లైంగిక ఆరోపణలు చేస్తున్నారు అంటూ పలువురు భావిస్తున్నారు.

- Advertisement -

అంతేకాదు బాలయ్య పై విచిత్ర పరోక్షంగా చేసిన ఆరోపణల వెనుక ఎవరో ఉన్నారని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.ఇలాంటి ఆరోపణలవల్ల ఇండస్ట్రీ పరువు పోతుందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో బాలయ్య విచిత్రపై పరువు నష్టం దావా వేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్యను రాజకీయంగా తొక్కేయడానికి ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై బాలయ్య ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు