మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జల్సా సినిమాతో స్టార్ట్ అయిన వీరి ప్రయాణం.. ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ సినిమా వరకు సాగింది. ఇక ముందు కూడా వీరి కాంబో సినిమాలు వచ్చే అవకాశం ఉంది. పవన్ సినిమాలకు త్రివిక్రమ్ డైరెక్టర్ గా కాకున్నా… డైలాగ్స్ రాసే బాధ్యతలను అయినా తీసుకుంటారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాబోయే సినిమా.. సముద్ర ఖనిలో వినోదాయి సీతం అనే తమిళ సినిమాను తెలుగు రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ప్రధాన పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ మాటలను అందించబోతున్నారు. దీని తర్వాత పవన్ చేసే మరో సినిమాకు కూడా త్రివిక్రమ్ స్క్రీప్ట్ పనులు చేస్తున్నట్టు సమాచారం. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. డైరెక్టర్ గా ఎప్పుడు కనిపిస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో ఎన్టీఆర్ తో ‘అయిననూ పోయిరావలే హస్తినకు’ అనే సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి.
అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అలాగే ప్రిన్స్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో కూడా సినిమా వస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమా కూడా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. పవన్ కోసం త్రివిక్రమ్.. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను వదిలేశారా.. అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.