మెగా స్టార్ చిరంజీవి – కాజల్ అగర్వాల్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – పూజా హెగ్డే నటించిన ఆచార్య ట్రైలర్ మంగళవారం విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ ట్రైలర్ పై ఫ్యాన్స్ కొంత వరకు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆచార్య ట్రైలర్.. మెగాస్టార్ చిరంజీవి స్థాయికి తగ్గట్టుగా లేదని అభిమానులు పలు సోషల్ మీడియా వేదికలపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ ట్రైలర్ లో బీజీఎం బాగలేదని, పూర్తిగా నిరుత్సహపర్చిందని వాపోతున్నారు. మణిశర్మ తన మార్క్ ను అందుకోవడంలో విఫలం అయ్యాడని ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే ఈ ట్రైలర్ లో మెయిన్ హీరోయిన్ అయినా.. కాజల్ అగర్వాల్ కనీసం ఒక్క షాట్ లో కూడా కనిపించలేదు. కాజల్ ఫ్యాన్స్ కూడా కొరటాల శివపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆచార్య చిత్ర బృందం ట్రైలర్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నట్టు సమాచారం. ఫ్యాన్స్ లో ఉన్న అసంతృప్తిని తొలగించడానికి రెండో ట్రైలర్ ను తీసుకురావడానికి సిద్ధం అవుతున్నారు.
కాగ గతంలో భీమ్లా నాయక్ సినిమా కూడా రెండు ట్రైలర్లను విడుదల చేసింది. మొదటి టైలర్ ఫ్యాన్ కు మింగుడుపడక పోవడంతో.. రెండు రోజుల వ్యవధిలోనే మరో ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. భీమ్లా నాయక్ మొదటి ట్రైలర్ లో బీజీఎం తో పాటు పవర్ స్టార్ మార్క్ లేదు. కానీ తర్వాత వచ్చిన ట్రైలర్ లో అభిమానులకు కావాల్సిన స్టఫ్ దొరకింది. ఇప్పుడు ఆచార్య కూడా.. భీమ్లా నాయక్ బాటలోనే నడవబోతుందని సమాచారం. కాగ ఆచార్య నుంచి వచ్చే రెండో ట్రైలర్ అయినా.. ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.