టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 24వ తేదీన విడదల అయి సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 1,000 కోట్లు వసూల్ చేసి రికార్డులను నెలకొల్పుతుంది. ఈ సినిమాలో తారక్, ఎన్టీఆర్ యాక్టింగ్ కు తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఫీదా అవుతున్నారు.
రాజమౌళి దర్శకత్వానికి భారత సినీ ప్రపంచమే జై జైలు పలుకుతుంది. ఈ సినిమా 3 గంటలు ఉన్నా.. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి థ్రిల్ ను అందించింది. కాగ ఈ సినిమాలో కొన్ని ఆకట్టుకునే 20 నుంచి 30 నిమిషాలు గల సన్నివేశాలను తొలగించారట. జక్కన్నకు ఈ సీన్లను కట్ చేయడం ఇష్టం లేకున్నా.. సినిమా నడివి ఎక్కువ అవుతుందని ఎడిట్ చేశారట.
Read More: Krithi Shetty : కోలీవుడ్ ఛాన్స్ మిస్
ఈ సన్నీవేశాల్లో మల్లీ, భీమ్ మధ్య ఫ్లాష్ బ్యాక్ సన్నీవేశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ సీన్లకు భారీ బడ్జెట్ ను కూడా కేటాయించారట. ఈ విషయం.. ఆర్ఆర్ఆర్ సినిమాలో మల్లీ పాత్ర చేసిన ఆహ్మ్రీన్ అంజుమ్ తాన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేయడం వల్ల బయటకు వచ్చింది.
దీంతో ఫ్యాన్స్.. ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను కూడా సినిమాలో ఉంచాల్సిందని కామెంట్ చేస్తున్నారు. నిడివి ఎక్కువ ఉంటే.. బహుబలి సినిమాలా రెండు పార్ట్స్ చేసినా.. బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాగ దీనిపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు.
Read More: Prabhas : విడుదలకు ముందే..
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...