సినిమా నిర్మాణంలో గత కొద్ది రోజుల నుంచి హీరోలు, డైరెక్టర్లు కొత్తగా ఓ స్ట్రాటజీని సెట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న రెమ్యునరేషన్ పద్దతికి హీరోలు, డైరెక్టర్లు స్వస్తి పలుకుతున్నారు. రెమ్యునరేషన్ స్థానంలో కొత్తగా ప్యాకేజీలు తీసుకువస్తున్నారు. సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో షేర్ తీసుకుని లాభపడుతున్నారు.
ఈ సంప్రదాయాన్ని ముందుగా డైరెక్టర్ లలో ఎస్ ఎస్ రాజమౌళి, హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తీసుకువచ్చారు. వీరితో పాటు చాలా మంది డైరెక్టర్లు, హీరోలు ప్రస్తుతం ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. చిన్న, పెద్ద అంటూ తేడా లేకుండా.. హీరోలు, డైరెక్టర్లు ప్యాకేజీలకే మొగ్గు చూపుతున్నారు. డైరెక్టర్ లలో ఎస్ ఎస్ రాజమౌళి నుంచి మారుతి వరకు, హీరోల్లో ప్రిన్స్ మహేశ్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల నుంచి కిరణ్ అబ్బవరం వరకు సినిమాకు వచ్చిన లాభాల్లో వాటానే తీసుకుంటున్నారు.
ఈ ప్యాకేజీల విషయంలో హీరోలు, డైరెక్టర్లు ముందుగానే చర్చించుకుని.. తర్వాత ప్రొడ్యూసర్లతో ప్యాకేజీల గురించి చెబుతున్నారు. టాలీవుడ్ అమలు అవుతున్న ఈ ప్యాకేజీ సంప్రదాయం వల్ల కొంత మంది ప్రొడ్యూసర్లు లాభం పొందుతున్నారు. మరి కొంత మంది ప్రొడ్యూసర్లు పీకల వరకు నష్టపోతున్నారు