BRO: పవర్ స్టార్ అసలు స్టామినా ఏంటో చూపించే సినిమా ఇదే?

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్న చిరంజీవి తర్వాత ఆయన లెగసి ని కంటిన్యూ చేస్తూ, మాములు సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ రికార్డులని తిరగరాసే సత్తా ఉన్న హీరోగా, ఫాలోయింగ్ లో, క్రేజ్ లో తెలుగు ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన హీరోగా నిలిచాడు.

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన “బ్రో” సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. అయితే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ హీరో అన్న ఒక్క అంశం తప్పితే చాలా ప్రతికూల అంశాలు ఎదురయ్యాయి. మూవీ మొదలైనప్పుడే ఇది ఒక రీమేక్ సినిమా అని, తెలుగు డైరెక్టర్లని వదిలేసి తమిళ్ డైరెక్టర్ తో ఎందుకు చేస్తున్నాడని రకరకాల విమర్శలు వచ్చాయి. రీసెంట్ గా సాంగ్స్ టీజర్స్ కూడా మెప్పించలేదని సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక అన్నిటికంటే పెద్ద సమస్యగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా ఎదుర్కుంటున్న పరిస్థితుల గురించి తెలిసిందే. గతంలో ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వం రూల్స్ పేరుతో రిలీజ్ చేసినపుడు ఎంత ఇబ్బంది పెట్టారో తెలిసిందే. అందుకే బ్రో నిర్మాతలు ముందుగానే జాగ్రత్త పడుతూ నార్మల్ టికెట్ రేట్లనే నిర్ణయించారు. ఇక సినిమాని కూడా డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ రేట్లకే అమ్మడం జరిగింది.

- Advertisement -

అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య వస్తున్న “బ్రో” సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తే ఇక్కడే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో అందరికి తెలుస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ ని ట్రోల్స్ చేసే ఇతర పార్టీల యాంటీస్ కి కూడా pspk క్రేజ్ గురించి తెలుస్తుంది. మరి ఇది జరగాలంటే జులై 29న “బ్రో” రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు