Nandini Reddy: ‘అలా మొదలైంది’… అప్పుడే ముగిసిందా..?

అలా మొదలైంది సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని తన ప్రత్యేకత చాటుకుంది నందిని రెడ్డి. మహిళా డైరెక్టర్స్ తక్కువున్న టాలీవుడ్లో మహిళలు నిలదొక్కుకోవడం అసాధ్యం అని భావిస్తున్న సమయంలో నందిని రెడ్డి అలా మొదలైంది సినిమాతో ఆ అపవాదుని చెరిపేసింది. టాలీవుడ్లో మహిళా దర్శకులు భానుమతి, విజయనిర్మల, బి.జయల తర్వాత ఒక్క సినిమాతోనే అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది నందిని రెడ్డి. అయితే, అలా మొదలైంది సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ఆ మధ్య వచ్చిన కల్యాణ వైభోగమే, ఓ బేబీ వంటి సినిమాలకు విమర్శకుల ప్రశంసలు అందినప్పటికీ కమర్షియల్ గా అలా మొదలైంది రేంజ్ లో సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో, హీరోయిన్లుగా నందిని రెడ్డి డైరెక్షన్లో రూపొందిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ట్రైలర్ తో మంచి ఫీల్ ని క్రియేట్ చేయగలిగిన ఈ సినిమా థియేటర్లో అలరించలేకపోయింది. స్లో నేరేషన్ తో ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేయలేకపోయింది, మంచి ప్రొడక్షన్ వాల్వుస్ తో కంటికి ఇంపైన విజువల్స్ ఉన్నప్పటికీ కథలో బలం లేకపోవటం వల్ల వాటిని ఆడియెన్స్ ఆస్వాదించలేక పోయారు. మిక్కీ జే మేయర్ అందించిన ఒకటి, రెండు పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ కథనంలో వేగం క్షీణించి వెంటిలేటర్ మీద ఉన్న ఈ సినిమాను బతికించలేకపోయాయి. మొత్తం మీద వరుస హిట్స్ తో అజేయంగా కొనసాగుతున్న స్వప్న సినిమాస్ బ్యానర్ కు ‘అన్నీ మంచి శకునములే’ సినిమాతో మొదటి ఫ్లాప్ ను అందించింది నందిని రెడ్డి.

ఈ నేపథ్యంలో నందిని రెడ్డి ట్రాక్ తప్పిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్న దర్శకురాలి నుండి ఇంతటి నాసిరకం సినిమా రావటంతో నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా కేజీఎఫ్ సినిమాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు పక్కనే ఉన్న నందిని రెడ్డి పగలబడి నవ్వటాన్ని గుర్తు చేస్తూ ‘ఆ ఈస్థటిక్ సెన్స్’ ఇప్పుడేమైంది అంటూ కొంత మంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి, ఇక మీదట తీసే సినిమాతో అయినా హిట్ అందుకొని నందిని రెడ్డి కమ్ బ్యాక్ ఇస్తుందా లేక వన్ టైమ్ వండర్ గా మిగిలిపోతుందా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు