Vikram: సూపర్ స్టార్ కి విలన్ గా విక్రమ్ – క్రేజీ కాంబినేషన్..!

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ పేరు వినగానే విలక్షణ నటన, సినిమా పట్ల డెడికేషన్ గుర్తొస్తాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో గొప్ప నటుల జాబితాలో నేటితరం నటుల్లో విక్రమ్ ముందుంటాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. నటించిన ప్రతి సినిమాలో విక్రమ్ విలక్షణ నటనకు ప్రశంసలు దక్కినప్పటికీ, కమర్షియల్ హిట్స్ వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే సంఖ్యలో మాత్రమే ఉన్నాయి.57ఏళ్ళ వయసున్న విక్రమ్ ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాలో యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా నటించి అలరించాడు విక్రమ్. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో విలన్ గా విక్రమ్ నటించనున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రజినీకాంత్ చేయనున్న సినిమాలో విక్రమ్ విలన్ గా నటించనున్నారని, ఇందుకు గాను ఆ సంస్థ విక్రమ్ 50కోట్ల సింగిల్ పేమెంట్ ని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇదే గనక నిజం అయితే, ఇద్దరు హేమాహేమీలు హీరో, విలన్ గా తలపడటం స్క్రీన్ మీద చూసే అవకాశం త్వరలోనే వస్తుంది. గాసిప్ దశలోనే హీట్ పెంచుతున్న ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే గనక పాన్ ఇండియా హిట్ ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

హీరో సూర్య కూడా గత సంవత్సరం విక్రమ్ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యామియోలో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు విక్రమ్ కూడా నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు అన్న వార్త ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. రజినీకాంత్ కూడా కమర్షియల్ హిట్ అందుకొని చాలా కాలం అయ్యింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి నటించబోయే సినిమా ద్వారా అయినా విక్రమ్, రజినీకాంత్ లకు హిట్ అందుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు