Thalaivar 170 : రజినీకాంత్ కు షాక్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్

Thalaivar 170

72 ఏళ్ళ వయసు వచ్చిన కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ.. ఆయన అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇటీవలనే నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రజినీకాంత్ అంతలోనే మరో సినిమా పనులు మొదలు పెట్టేసాడు.

ఇప్పటికే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ అనే సినిమాలో ప్రముఖ పాత్రలో కనిపించబోతున్న రజిని, ఇటివలనే ఈ సినిమా పనులు కంప్లిట్ చేసి.. ఆయన సోలో హీరోగా చేస్తున్న చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకి జై భీం సినిమా ఫేం టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిచబోతుంది.

పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న రజీనికాంత్, టీజే జ్ఞానవేళ్‌ ల సినిమా తరువాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజిని సినిమా చెయ్యాల్సి ఉండింది. ప్రస్తుతం తలపతి విజయ్ తో లియో సినిమా చేస్తున్న లోకేష్ కనకరాజ్, లియో రిలీజ్ తరువాత రజినీకాంత్ తో సినిమా ప్రారంభమవ్వాల్సి ఉండగా కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనికి కారణం లోకేష్ కనకరాజ్ రజినీకాంత్ తో చేయబోయే సినిమా కూడా దాదాపు జైలర్ లాంటి కథనేనట . అయితే జైలర్ సినిమా ఆల్రెడీ రిలీజై పెద్ద హిట్ అవ్వడంతో లోకేష్ రజినీకాంత్ సినిమాపై ఎక్కువ శ్రద్ధ చూపించట్లేదట. దాంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు