Stree 2: మళ్లీ కావాలయ్యా అంటున్న మిల్క్ బ్యూటీ?

మిల్క్ బ్యూటీ తమన్నా… హీరోయిన్ గా మాత్రమే కాదు.. కావాలయ్యా అంటూ స్టెప్స్ వేస్తూ కుర్రకారును ఊగేలా చేసింది. జైలర్ సినిమాలో నువ్వు కవాలయ్యా అంటూ వచ్చిన స్పెషల్ సాంగ్ ఇప్పటికీ ఆడియన్స్ నోటి నుంచి వస్తుంది అంటే.. దానికి కారణం మిల్క్ బ్యూటీ తమన్నానే అని చెప్పొచ్చు. ఈ సాంగ్ తర్వాత తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసినా సినిమాకు ప్లస్ అవుతుందని డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నమ్ముతున్నారు.

అలాగే ఆడియన్స్ కూడా తమన్నాను ఇలాంటి స్పెషల్ సాంగ్స్ మళ్లీ చూడాలని అనుకుంటున్నారు. కానీ, అలాంటి అవకాశం వస్తుందా అనే డౌట్ అయితే ఉండేది. కానీ… బాలీవుడ్ నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం చూస్తే ఆడియన్స్ అనుకున్నది జరిగేలా ఉందని తెలుస్తుంది. తమన్నా మరోసారి స్పెషల్ సాంగ్ లో మెరవబోతుందని బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది.

బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావ్, శ్రాద్ధా కపూర్ మెయిన్ లీడ్ లో స్త్రీ 2 అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందట. ఇదిలా ఉండగా, స్త్రీ 2 స్టోరీ పరంంగా ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట. అందుకు తమన్నాను తీసుకోవాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే తమన్నాతో ప్రాథమిక చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. రెమ్యునరేషన్ తో సహా అన్ని కుదిరితే తమన్నా స్పెషల్ సాంగ్ ఫిక్స్ అయినట్టే. కాగా, దీనిపై మూవీ యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు