Netflix : మెగా ఫ్యామిలీపై కన్నేసిన నెట్ ఫ్లిక్స్ సీఈఓ… అసలు ప్లాన్ ఏంటి?

పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈఓ తాజాగా మెగా ఫ్యామిలీని కలిశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వీళ్లంతా కలిసి అసలేం ప్లాన్ చేస్తున్నారు అనే విషయం ఉత్కంఠతను రేపుతోంది.

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు పలువురు మెగా హీరోలను ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ సీఈఓ నిన్న సాయంత్రం కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డిసెంబర్ 7న హైదరాబాద్ వచ్చి రాగానే నేరుగా జూబ్లీహిల్స్ లో ఉన్న రామ్ చరణ్ ఇంటికే వెళ్లిపోయాడు. ఇక అక్కడ చెర్రీతో పాటు మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరం తేజ్, పంజా వైష్ణవ తేజ్ వంటి మెగా హీరోలు కూడా ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం టెడ్ ఈ మెగా హీరోలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ లతో నెట్ ఫ్లిక్స్ సీఈఓతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ సీఈఓ ఇలా డైరెక్ట్ గా మెగా ఫ్యామిలీని కలవడం వెనక ఉన్న కారణం ఏంటి అనే విషయం ఆసక్తిని పెంచేస్తోంది. ఆయన మామూలుగానే కలిశాడా? లేదంటే ఈ మెగా హీరోలతో కలిసి ఏదైనా భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా ? అనేది తెలియాల్సి ఉంది. అయితే వైరల్ అవుతున్న ఆ ఫోటోలను చూసి ఆయన హైదరాబాద్ వచ్చి రాగానే మెగా ఫ్యామిలీని కలవడం వెనక ఏదో ఒక ప్లాన్ ఉందని అంటున్నారు.

కాగా గతంలో రామ్ చరణ్ ఒక హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ప్రశంసలు కురిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లోను సంచలనం సృష్టించింది. దీంతో 2022లో వచ్చిన బెస్ట్ అండ్ మోస్ట్ రెవల్యూషనరీ మూవీ “ఆర్ఆర్ఆర్” అంటూ చిత్ర బృందాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఇక ఇప్పుడు హైదరాబాదుకు రాగానే నేరుగా చెర్రీని, మెగా హీరోలను ఆయన స్వయంగా కలవడం విశేషం. మరి వీళ్ళ అసలు ప్లాన్ ఏంటి అనే విషయం తెలియాలంటే వారి నుంచే అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ప్రస్తుతం భారతీయ కంటెంట్ పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే టెడ్ పలువురు బాలీవుడ్ నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నెట్ ఫ్లిక్స్ సీఈవో తన పర్యటనలో భాగంగా పలువురు తెలుగు సినిమా తారలను, అగ్ర నిర్మాతలను కలుస్తారని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. మరి టెడ్ మెగా ఫ్యామిలీ తర్వాత ఇంకా ఏ ఇతర హీరోలను కలవబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. కాగా తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సెలెక్టివ్ పద్ధతిలో చేజెక్కించుకుంటూ బాగానే లాభాలు ఆర్జిస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ “గేమ్ చేంజర్” మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్టత తన నెక్స్ట్ మూవీ ని చేస్తున్నాడు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు