Tamannaah: విజయ్ వర్మతో కంటే ముందే ఆ హీరోతో ప్రేమలో పడ్డ తమన్నా..!

Tamannaah

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతోనే కాకుండా గ్లామర్ పరంగా, డాన్స్ పరంగా కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది తమన్నా. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించడం వల్ల తన గ్లామర్ పెంచేయడమే కాకుండా బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తమన్నా ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తమన్నా గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ వర్మతో కంటే ముందే తమన్న ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం కొనసాగించిందట. ఆ హీరో మరెవరో కాదు కార్తీ. తమన్నా – కార్తీ ఆవారా అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. లింగు స్వామి దర్శకత్వంలో రోడ్డు డ్రామాగా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికీ స్పెషల్ ఆడియన్స్ ఉంటారు. ఈ సినిమాలోని పాటలను ఇప్పటికీ తరచూ ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం. అయితే ఈ సినిమాలో నటించే సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్.

తమన్నా మీద ప్రేమతో కార్తీ చెన్నైలో ఓ విలాసవంతమైన ప్లాట్ ని కూడా కొనిచ్చినట్లు అప్పట్లో కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఆ ఫ్లాట్ ఇప్పటికీ కూడా తమన్నా వద్దే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం హీరో కార్తీ ఇంట్లో తెలియడంతో వీరి పెళ్లికి కార్తీ తండ్రి ఒప్పుకోలేదట. అతడి సోదరుడైన సూర్య అప్పటికే జ్యోతిక ని వివాహం చేసుకోవడంతో.. మరో కోడలు కూడా హీరోయిన్ కావడానికి వీలులేదని కార్తీ తండ్రి తేల్చి చెప్పారట. దీంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొని.. కార్తీ తన బంధువుల అమ్మాయి అయిన రజినీని వివాహం చేసుకున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు