Singam4: ఆ డైరెక్టర్ తో సూర్య సినిమా – లైన్ క్లియర్..!

సూర్య, కోలీవుడ్ హీరో అయినప్పటికీ అక్కడి కంటే టాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సినిమా, కంగువా సినిమాలను లైన్లో పెట్టిన సూర్య తర్వాత సినిమా సింగం సిరీస్ తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ హరితో చేయనున్నారని సమాచారం అందుతుంది. నిజానికి ఈ కాంబినేషన్లో సింగం – 4 సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సి ఉండగా అప్పట్లో డైరెక్టర్ హరి, హీరో సూర్య మధ్య గొడవలు రావటంతో  ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలొచ్చాయి.అయితే ఇటీవల డైరెక్టర్ హరి నిర్మించిన ఓ స్టూడియో ఓపెనింగ్ కి హీరో సూర్య దంపతులు హాజరవటంతో ఇద్దరి మధ్య గొడవలు లేవని స్పష్టత వచ్చింది. దీంతో తమ హీరోకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సిరీస్ లో మరో సినిమా రాబోతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సింగం పార్ట్ 1కి అనువాదంగా వచ్చిన యముడు సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఆ తర్వాత వచ్చిన రెండు సీక్వెల్స్ తెలుగులో అంతగా మెప్పించలేక పోయాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న డైరెక్టర్ టేకింగ్ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ఎందుకంటే, సూర్య ప్రస్తుతం కమిట్ అయ్యున్న ప్రాజెక్స్ట్ పూర్తీ కావాల్సి ఉండగా, డైరెక్టర్ హరి కూడా విశాల్, కార్తిలతో చెరొక ప్రాజెక్ట్, ఓ కొత్త హీరోతో మరో ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంది.

ప్రస్తుతం సౌత్ సినిమాలకు నార్త్ లో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తారా లేదా?, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు వేచి చూడాలి. యాక్షన్ బ్యాక్డ్రాప్ చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉన్న సింగం సిరీస్ నుండి మళ్ళీ అదే రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోందా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు