Tej: విరూపాక్ష కి అలా కలిసొచ్చిందా..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన సినిమా విరూపాక్ష. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలైన సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. సుమారు 15కోట్ల మేర గ్రాస్ సాధించిన ఈ సినిమా తేజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. దసరా తర్వాత ఇటీవల వచ్చిన సినిమాలేవీ అంతగా ఆడకపోవడం విరూపాక్ష సినిమాకి కలిసొచ్చిందనే చెప్పాలి. ఏప్రిల్ నెలలో వచ్చిన రావణాసుర, మీటర్, శాకుంతలం సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించటం, థియేటర్లలో కొత్త సినిమాలేవీ లేకపోవటం వల్ల విరూపాక్షకి మంచి కలెక్షన్లు వచ్చేందుకు దోహద పడిందని చెప్పాలి.
యాక్సిడెంట్ నుండి రికవర్ అయిన తేజ్ పట్ల ఆడియెన్స్ లో ఉన్న సానుభూతి కూడా ఈ సినిమాకు అనుకూలంగా మారిందని చెప్పచ్చు. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ సాధించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవటంతో థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. సినిమాలో తేజ్, సంయుక్త నటనకు ప్రశంసలు అందుతున్నాయి, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో సంయుక్త పర్ఫామెన్స్ కి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్ స్థాయి పాన్ ఇండియా వైడ్ విస్తరించిన తరుణంలో తేజ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావటం తన కెరీర్ కి ప్లస్ అవుతుందనే చెప్పాలి. మొదట్లో ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేద్దామనుకొని తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు మేకర్స్. ఇప్పుడు సినిమాకు మంచి టాక్ రావటంతో హిందీలోకి డబ్ చేసి అక్కడ బాగా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తే కార్తికేయ2 సినిమా లాగా విరూపాక్ష కూడా నార్త్ లో హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు