Pawan Kalyan: OG నుండి మైండ్ బ్లోయింగ్ అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న పవన్ ఇటీవలే సుజిత్ డైరెక్షన్లో ఓజీ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. హరిహర వీరమల్లు కి కొంచెం గ్యాప్ ఇచ్చిన పవన్ సముద్రఖని దర్శకత్వంలో తేజ్ తో కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసాడు. ఇటీవలే విడుదలైన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం సినిమాకి మరింత హైప్ తెచ్చేలా ఉంది. అదేంటంటే, ఈ సినిమా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రూపొందనుందట.

గతంలో సుజిత్ నుండి మాఫియా బ్యాక్డ్రాప్ లో వచ్చిన సాహో సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకోలేకపోయినా సుజిత్ యాక్షన్ సీక్వెన్స్ ని డీల్ చేసిన విధానానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా కూడా డ్రగ్స్ మాఫియా బ్యాక్డ్రాప్ లో ఉండనుంది అన్న వార్త సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇందులో గన్స్, కాస్ట్లీ కార్లతో చేజింగ్ సీన్లతో  స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉండనున్నాయి అన్నది సమాచారం. ఇటీవలే హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నుండి పూర్తి స్థాయి యాక్షన్ బ్యాక్డ్రాప్ లో సినిమా రాలేదు. పైగా సుజిత్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఇంతవరకు చూపించని రీతిలో స్టైలిష్ గా చూపించబోతున్నాడు అన్న వార్తలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఎప్పుడో మొదలైన హరిహర వీరమల్లు సెట్స్ మీద ఇండగానే మిగతా సినిమాలు కంప్లీట్ చేసే పనిలో పడ్డ పవన్ ఆ సినిమా ఎప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేస్తాడో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు