SSMB 28 : మహేష్ తో సీనియర్ హీరో ?

టాలీవుడ్ గ్లామర్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు, ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి విధితమే. వీరిద్దరిది సక్సెస్ కాంబినేషన్. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా హై ట్రిక్ మూవీగా తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీపై మహేష్ బాబు ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు, ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు.

ఇక ఈ మూవీలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో మహేష్ బాబు సరసన మహర్షి సినిమాలో పూజా హెగ్డే చేయగా, ఇప్పుడు మరోసారి ప్రిన్స్ మహేష్ బాబుతో రొమాన్స్ చేయనుంది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందే అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మలయాళ హీరోను విలన్ గా తీసుకున్నట్లు మొన్నటి వరకు వార్తలు రాగా, ఇప్పుడు మరో గాసిప్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అదేంటంటే, మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటించబోతున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే హీరో రాజశేఖర్ తో చిత్ర బృందం మాట్లాడినట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హీరో రాజశేఖర్ కనిపించనున్నారట. అయితే దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడా రాలేదు. త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా వచ్చే నెల అంటే ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు