Dhanush : బర్డ్ డేకు సర్ప్రైజ్ రెడీ

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. ఇటీవల తన 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పి షాక్ ఇచ్చిన ధనుష్, విడాకుల అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. ధనుష్ కేవలం తమిళం కే పరిమితం కాకుండా హిందీలోనూ పలు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టారు ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో “సార్” అనే టైటిల్ ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

తమిళంలో “వాతి” అనే టైటిల్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకగా సంయుక్తా మీనన్ నటిస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ లెక్చరర్ పాత్రలో నటిస్తున్నారు. సమకాలీన రాజకీయ పరిస్థితులను తన విద్యార్థులలో ఓ సార్ ఎలా పరిష్కరించాడనే దానిపై ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 27న “సార్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ప్రకటించారు.

అయితే ఈనెల 28న ధనుష్ పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే గిఫ్ట్ ని రెడీ చేశారు ధనుష్. బర్త్ డే స్పెషల్ గా మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు ధనుష్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఈ నెల 28న రిలీజ్ కాబోయే టీజర్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు