Thalaivar171: రజినీతో మూవీకి ముఖం చాటేసిన షారుఖ్… కానీ ఆ డైరెక్టర్ కావాలట!

ఈ ఏడది “జైలర్” బ్లాక్ బస్టర్ హిట్ అయినా మూవీ జైలర్ రజనీకాంత్ లో ఫుల్ జోష్ నింపేసింది. ప్రస్తుతం ఆయన అదే జోష్ తో తన నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. ఖైదీ, విక్రమ్, లియో వంటి అద్భుతమైన యాక్షన్ బ్లాస్ట్ మూవీలను తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కొత్త మూవీ రూపొందనుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం డైరెక్టర్ లోకేష్ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ను సంప్రదించగా ఆయన నో చెప్పాడట. రజనీకాంత్ వంటి దిగ్గజ నటుడి సినిమాలో కనిపించడానికి షారుక్ ఎందుకు ఇష్టపడట్లేదు? ఆయన ఈ ఆఫర్ ను ఎందుకు రిజెక్ట్ చేశాడు? అనే వివరాల్లోకి వెళితే….

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, టాలెంటెడ్ తమిళ దర్శకుడు లోకేష్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీకి “తలైవర్ 171” అనే వాకింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. 2024 ఏప్రిల్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. అంతలోపు నటీనటులకు సంబంధించిన సెలక్షన్స్ జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే “తలైవర్ 171” సినిమాలో ఓ కీలక పాత్ర కోసం షారుక్ ఖాన్ ను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అనుకున్నట్టుగానే లోకేష్ తన కథతో షారుక్ వద్దకు వెళ్ళడట. ఇక ఆయనకి సినిమాలో షారుక్ కోసం రాసుకున్న కథను, ఆయన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను వివరించారట. షారుక్ కు కూడా కథ, పాత్ర రెండు బాగా నచ్చాయట. రజనీకాంత్ తో కలిసి నటించేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారట. కానీ ఆ పాత్రను మాత్రం తాను చేయలేనని చెప్పి షారుక్ లోకేష్ కి షాక్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ విషయంపైనే సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. అయితే షారుక్ రజనీకాంత్ సినిమాలో నటించకపోవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందట.

- Advertisement -

ఇటీవల కాలంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న షారుక్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రీసెంట్ గా ఆయన నటించిన పఠాన్, జవాన్ సినిమాలు అద్భుతమైన కలెక్షన్లు రాబట్టడం చూస్తుంటే షారుక్ లైఫ్ లో మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, లేదా కీలక పాత్రలు చేయకపోవడం మంచిదని షారుక్ భావిస్తున్నాడట. ప్రస్తుతం తనకు మంచి టైం నడుస్తుండడంతో తాను హీరోగా చేయాల్సిన సొంత సినిమాలపై మాత్రమే కాన్సెంట్రేట్ చేయాలని షారుక్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ఇప్పటిదాకా షారుక్ చాలా సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించాడు. అయితే అవి కేవలం బాలీవుడ్ కే పరిమితం కావడం గమనార్హం. “తలైవర్ 171″లో నటించడానికి షారుక్ ఆసక్తి చూపించలేదు కానీ, లోకేష్ చెప్పిన కథకు, ఆయన నేరేడ్ చేసిన విధానానికి షారు ఫిదా అయ్యాడట. దీంతో లోకేష్ తో కలిసి తాను హీరోగా నెక్స్ట్ మూవీ చేద్దామనే నిర్ణయాన్ని డైరెక్టర్ ముందు ఉంచాడట. మరి వీరిద్దరి కాంబోలో నెక్స్ట్ మూవీ రాబోతోందా? అనేది చూడాలి.

ఇక ప్రస్తుతం ఈ హీరో “డంకీ” అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో డిసెంబర్ 22న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు