Sana: నిన్నే పెళ్ళాడుతా సినిమాలో సనా వయసు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

నటి సనా ప్రస్తుతం పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. మొదట ఈమె నిన్నే పెళ్ళాడుతా అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఆ చిత్రంలో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడంతో అప్పటినుంచి ఎక్కువగా ఈమెకు అలాంటి పాత్రలలోనే అవకాశాలు వస్తున్నాయని తెలియజేయడం జరిగింది.. సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనకి అసలు షూటింగ్ అంటే ఎలా ఉంటుంది? నటన అంటే ఎలా ఉంటుందో ? అనే విషయం కూడా తెలియదని తెలియజేసింది.

కానీ ఎలాంటి అవగాహన లేకుండానే మొట్టమొదటిసారిగా నిన్నే పెళ్ళాడుతా అనే సినిమాలో నటించానని తెలిపింది. ఆ సమయంలో తనకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అసలు వచ్చేది కాదని సన. అయినప్పటికీ ఇండస్ట్రీ తనకు చాలానే ఇచ్చిందని సినిమా ఇండస్ట్రీతో ఉండేటువంటి పలు విషయాలను తెలుసుకొని నేర్చుకొని పలు సినిమాలలో నటించానని తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానంటే కొంతమంది దర్శక నిర్మాతల వల్లే అది సాధ్యమైందని తెలిపింది సన.

చాలామంది దర్శక నిర్మాతలు తన నటన చూసి ఒక సినిమా తర్వాత మరొక సినిమాలో అవకాశాలు ఇచ్చారని.. ఇప్పుడైతే తెలుగు బాగా మాట్లాడుతున్నాను.. కానీ రాయడం, చదవడం మాత్రం నేర్చుకోలేకపోయానని.. కెరియర్లో కాస్త బిజీగా ఉన్నప్పుడు నేర్చుకోలేకపోయాను అని తెలియజేసింది సన.. తన జీవితం ఈ రోజున ఇంత ఆనందంగా ఉంది అంటే ముఖ్య కారణం అందుకు డైరెక్టర్ రాఘవేంద్రరావు అని .. ఆయన అన్ని చిత్రాలలో తనకి అవకాశం ఇచ్చారని ఇప్పటికి ఆయన సినిమాలలో సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉన్నానని తెలియజేశారు.

- Advertisement -

అందుకే ఈ రోజున ఇంత సంతోషంగా ఉన్నాను కాబట్టే ఆయన పేరు చెప్పుకుంటున్నానని తెలియజేసింది. తన కుటుంబంలో కూడా చాలామంది నటులు ఉన్నారని తన కొడుకు కూడా తమిళ సీరియల్స్ లో పలు రకాల పాత్రలలో ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నారని.. తన కోడలు సమీరా షరీఫ్ కూడా తెలుగులో ఎన్నో సీరియల్స్ లో ఒకప్పుడు నటించింది అని .. ఆ తరువాత హోస్ట్ గా కూడా పని చేసిందని తెలియజేయడం జరిగింది సన. అయితే తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో తన వయసు మాత్రం 16 నుంచి 18 సంవత్సరాల లోపే ఉండేది అని తెలియజేయడం జరిగింది సనా. ఇదంతా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో ఆమె వయసు కేవలం 18 సంవత్సరాల అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు