Rules Ranjann: స్క్రిప్ట్ ముఖ్యం కిరణు

కిరణ్ అబ్బవరం ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టిన కిరణ్ అబ్బవరం “రాజా వారు రాణి గారు” సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో మంచి హిట్ అందుకుని మంచి పేరును కూడా సంపాదించాడు. రాజా వారు రాణి గారు సినిమా తరువాత కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలో నటించాడు.

ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా లో కేవలం నటించడం మాత్రమే కాకుండా రైటింగ్ లో కూడా తన ప్రతిభను చూపించాడు. ఈ సినిమా కరోనా టైం లో వచ్చినా కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకొని కిరణ్ అబ్బవరం ను హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేకుండా పోయింది.
ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అబ్బవరం కి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి పలు ఛాన్సులు వచ్చాయి. ఆ తరుణంలో అవకాశాన్ని వదులుకోకూడదు అనే ఉద్దేశంతో తన వద్దకు వచ్చిన ప్రతి స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేసి సినిమాలు చేసేసాడు. కానీ ఆ సినిమాలు ఏవి కూడా ఆశించిన విజయాన్ని అందివ్వలేదు.

సెబాస్టియన్ , సమ్మతమే , నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్ వంటి సినిమాలు వరుస ప్లాపులను కిరణ్ అబ్బవరం కి మూటగట్టాయి. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో రచన కూడా తనలో ఒక ప్రతిభ కాబట్టి, దానిని కూడా యూస్ చేస్తూ సరైన స్క్రిప్ట్స్ ను ఎంచుకుంటూ ముందుకెళ్తే,
మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవచ్చు.

- Advertisement -

లేదంటే చాలామంది హీరోలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చి వెళ్లిపోయినట్లే అలా కనుమరుగైపోక తప్పదని చాలామంది సినీ విశ్లేషకుల అభిప్రాయం. కిరణ్ కి టాలెంట్ లేక కాదు కానీ, ఒక మంచి స్క్రిప్ట్ ని ఎన్నుకోవడం విషయంలో మనవాడు కాస్త వెనక తగ్గాడు అనేది చాలామంది అభిప్రాయం. ఏదేమైనా మళ్ళీ తన ప్రతిభకి పదును పెట్టి మంచి సినిమా చేస్తే తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడానికి రెడీ గా ఉన్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు