Kollywood: ‘లియో’ బిజినెస్.. విజయ్ కెరీర్ బెస్ట్.. డే 1 టార్గెట్ 100కోట్లు?

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఈ ఇయర్ స్ట్రాంగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే లియో పై చాలా రోజుల నుండి ఫోకస్ పెట్టాడు. దానికోసం సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండడానికి ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసాడు. ఇక లియో సినిమాకి లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దీనికితోడు లియో ట్రైలర్ కూడా మెప్పించడంతో సినిమాపై భారీ హైప్ వచ్చేసింది. తాజాగా లియో థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. కాంబో హైప్ వల్లో, లేక భారీ క్యాస్టింగ్ వల్లో లియో సినిమా కి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ జరిగింది. కేవలం తమిళ నాడు లోనే 70 కోట్ల వరకు బిజినెస్ జరగగా, కేరళ, మలేసియా, థాయిలాండ్, ఇంకా ఓవర్సీస్ సహా 150 కోట్లు దాటిం. ఇక కర్ణాటక, తెలుగు స్టేట్స్ కలిపి రెండు వందల కోట్లు బిజినెస్ చేయగా, ఓవరాల్ అన్ని ఏరియాల్లో కలిపి లియో కి 215కోట్ల బిజినెస్ జరిగింది.

ఇంతకు ముందు విజయ్ సినిమాల్లో బిగిల్ 134కోట్లు, వారసుడు137కోట్ల బిజినెస్ చేయగా, ఇప్పుడు చాలా పెద్ద మార్జిన్ తో లియో బిజినెస్ చేయడం విశేషం. ప్రస్తుతం లియో పై ఉన్న హైప్ కి టాక్ బాగుంటే వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక లియో బుకింగ్స్ ఇప్పటికే 20కోట్లు దాటిపోగా, ఫస్ట్ డే 100కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తెచ్చుకునేలా కనిపిస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు