Biggboss season7: హద్దు మీరిన ప్రశాంత్.. మళ్ళీ మొదటికొచ్చాడు?

టెలివిజన్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో రైతు బిడ్డ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ తన ఆటతో కాకుండా రైతు బిడ్డ సెంటిమెంట్ తో లాక్కొస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ దృష్టిలో ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ చాలా మంది ఆడియన్స్ సింపతీ ద్వారానే గెలిచాడు. అందుకే మొదట్లో బిగ్ బాస్ హౌస్ లో మెజారిటీ సభ్యులు పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శివాజీ సలహాలతో, సపోర్ట్ తో ఆటలో కొంచెం పరిణితి కనబరిచాడు.

అందుకే బిగ్ బాస్ కి కెప్టెన్ కూడా అయ్యాడు. అయితే ఈ వారం నామినేషన్ లో మళ్ళీ అదే రైతు బిడ్డ కనబడ్డాడు. నామినేషన్ టైం లో చెప్పింది వినకుండా మొండిగా మాట్లాడడమే గాకుండా, ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడు. సందీప్ ని నామినేట్ చేసే సమయంలో సందీప్ తనని ఊరోడు, భాష రాదు అన్నాడు అని సందీప్ పై ఆరోపించాడు. మళ్ళీ రెండు నిమిషాలకే మాట మార్చేసి సందీప్ అలా అన్నాడని నేననలేదు అన్నాడు.

ముందుగా సందీప్ కూడా చెప్పడానికి చాలా ట్రై చేసినా పల్లవి ప్రశాంత్ వినిపించుకోకపోవడం తో ఇక చేసేదేమీ లేక ప్రశాంత్ ఇంకా మెచ్యూర్డ్ అవ్వలేదు అని కుండ బద్దలు కొట్టేసాడు. ఈ షో చూసిన ఆడియన్స్ కూడా పల్లవి ప్రశాంత్ ఇంకా అప్డేట్ అవ్వలేదని ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ సీజన్లో వోటింగ్, ఆట మాత్రమే కాకుండా ఆటను వ్యక్తిగత ప్రవర్తనని కూడా పరిగణలోకి తీసుకునే ముందుకు వెళ్లాలని హౌస్ మేట్స్ అర్ధం చేకుకోవాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు