RC16: ఆ విషయంలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణే ముందున్నాడు

RC16

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత నుంచి చాలా విషయలలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య కంపారిజన్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు హీరోలకు వ్యక్తిగతంగా ఎలాంటి మనస్పర్థలు లేకున్నా కూడా ఈ హీరోల అభిమానులు మాత్రం తమ హీరోల మధ్య ఎక్కువ తక్కువలు చూస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తోన్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సునీల్, అంజలి, యస్ జె సూర్య, హీరో శ్రీకాంత్ లు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చెంజర్ సినిమా చేస్తూనే మరో పక్క బుచ్చి బాబు తో చేయబోయే సినిమా టెస్ట్ షూట్ లలో కూడా పాల్గొంటున్నాడు. ఇప్పటికే బుచ్చి బాబు సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయట. .

ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తోన్నాడు. హై ఎండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తరువాత ఏ సినిమా చేస్తాడనే విషయంపై క్లారిటీ లేదు. దేవర తరువాత ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తాడని ఇప్పటికే కన్ఫామ్ అయిన కూడా, ఈ ప్రాజెక్ట్ పై అందరిలో చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ పెద్ద హీరో కాబట్టి, ఎన్టీఆర్ పాత్రకు ఆయనతో సమానంగా ప్రాముఖ్యత ఉంటుందా.. ఉండదా అనేది తెలియడం లేదు. ఇక ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. కానీ ఆయనకు సలార్ పార్ట్ 1 మరియుపార్ట్ 2 రిలీజ్ లతో బిజీగా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే రామ్ చరణ్ సినిమాల ఎంపిక మరియు షూటింగ్ పరంగా ఎన్టీఆర్ కంటే ముందే ఉన్నాడని చెప్పవచ్చని ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు