Bigg Boss Season7: స్టార్ మా బ్యాచ్ ఏడుపే ప్రశాంత్ ని హౌస్ మేట్ చేసిందా..?

Bigg Boss Season7

బిగ్ బాస్ సీజన్ 7 మునుపటి సీజన్స్ కంటే ఆసక్తిగా సాగుతోంది. ప్రతిసారిలా కాకుండా ఈ సీజన్ ఉల్టా పల్టా పేరుతో గేమ్ లో చాలా మార్పులే చేసింది బిగ్ బాస్ టీమ్. ఈ మార్పుల్లో భాగంగా ప్లాన్ చేసిన పవర్ అస్త్ర టాస్క్ చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. ఈ వారం పవర్ అస్త్ర టాస్క్ లో ప్రశాంత్, యావర్, శుభశ్రీ పోటీ పడ్డారు.
అందరు ఈ టాస్క్ లో యావర్ గెలుస్తాడని భావించగా అనూహ్యంగా ప్రశాంత్ గెలిచాడు. స్టార్ మా బ్యాచ్ ఈ టాస్క్ లో ప్రశాంత్ ని ఓడించాలని ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. మొత్తానికి ప్రశాంత్ హౌస్ మెట్ అవ్వటం స్టార్ మా బ్యాచ్ కి పెద్ద షాక్ తగిలినట్లయింది.
వాస్తవానికి ప్రశాంత్ హౌస్ లో ఫేక్ గా అనిపిస్తున్నప్పటికీ కామన్ మ్యాన్ అనే సింపతితో ఓట్స్ వస్తున్నాయి. దీనికి తోడు స్టార్ మా బ్యాచ్ అదే పనిగా ప్రశాంత్ ని టార్గెట్ చేస్తుండటం కూడా అతనికి ప్లస్ అయ్యిందని చెప్పాలి. హౌస్ లోకి ఎంటరైన ఫస్ట్ వీక్ లోనే శివాజీ ఆ నలుగురిని స్టార్ మా బ్యాచ్ అంటూ ముద్ర వేయటం ఆడియెన్స్ లోకి గట్టిగా వెళ్ళింది.
శివాజీ బ్రాండ్ వేసినట్లుగానే ఈ నలుగురు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి గేమ్ ఆడుతున్నారు. ఇది ఆడియెన్స్ లో నెగిటివిటి క్రియేట్ చేసింది. ప్రశాంత్ ని కావాలనే ఈ నలుగురు టార్గెట్ చేస్తున్నట్లు  ప్రొజెక్ట్ అయ్యింది. శివాజీ కూడా స్టార్ మా బ్యాచ్ ని మొదటి నుండి వ్యతిరేకించటం, ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తూ వస్తుండటం కూడా ప్రశాంత్ కి ప్లస్ అయ్యిందని చెప్పాలి. మొత్తానికి ప్రశాంత్ హౌస్ మెట్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ వీక్ నుండి గేమ్ ఎలా మారుతుందో చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు