RGV: రామ్ గోపాల్ వర్మ ని జుట్టుపట్టి కొట్టిన భార్య..?

వివాదాస్పద దర్శకుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వర్మ.. రాను రాను వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆయన సినిమాలు కూడా అదే విధంగా మారాయి. ఇక సమాజంలో జరిగే చాలా విషయాలపై ఆయన సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటాడు. ఎవరి మీద కోపం ఉన్నా సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తాడు. అయితే ఇప్పుడు వర్మ గురించి ఓ ఆసక్తికర వార్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

వర్మ తన కుటుంబానికి దూరంగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఆయనకు భార్య రత్న, కూతురు రేవతి ఉండేవారు. వర్మ – రత్న పెళ్లి జరిగిన కొంతకాలం వీరి దాంపత్య జీవితం బాగానే కొనసాగిందట. కానీ కొంతకాలం తర్వాత వర్మ సినిమాలకు పిచ్చిలో పడి ఇంటికి రావడం మానేసి మద్యం మత్తులో తాగుతూ తిరిగేవారట. ఇలా ప్రతిరోజు వర్మ చేసే పనులకు విసిగిపోయిన రత్న ఇంటికి రాగానే అరవడం స్టార్ట్ చేసేదట. ఆమె ఎంత తిట్టినా మాత్రం వర్మ సైలెంట్ గా ఉండేవారట. ఇలా రోజు రోజు ఆయన హద్దులు మీరడంతో ఓ రోజు ఏకంగా ఆయన గురించి ఏం విషయం తెలిసిందో ఏమో తెలియదు కానీ ఆయన ఇంటికి రావడంతోనే గట్టిగా నిలదీసిందట. అయినా వర్మ స్పందించకపోవడంతో కోపంతో జుట్టు పట్టుకొని బయటకు లాగి గోడకేసి కొట్టిందట. ఇలా రోజు కొట్టుకోవడం కంటే విడిపోవడం బెటర్ అని ఇద్దరూ డిసైడ్ అయ్యారట.

అలా వీరిద్దరూ విడాకులు తీసుకుని.. కూతురిని మాత్రం రత్న తీసుకొని వెళ్ళిపోయింది. ఇక రత్న తన పాపను చాలా కష్టపడి పెంచి ప్రణవ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. అతను అమెరికాలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. అలా రామ్ గోపాల్ వర్మ జీవితంలోంచి ఆయన భార్య వెళ్ళిపోవడం నిజంగానే బాధాకరమైన విషయం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు