Sai dharam tej: ప్రీమియర్ కి సిద్ధమైన బ్లాక్ బస్టర్ మూవీ. టిఆర్పి రికార్డు కొడుతుందా?

టాలీవుడ్ మూవీస్ థియేటర్లలోనే కాదు టీవీల్లోనూ, ఓటిటి ప్లేట్ ఫామ్ లోను రికార్డులు సృస్తిస్తున్నాయి. కొన్ని సినిమాలు వెండితెర పైన ఆడకపోయినా బుల్లితెర మీద భారీ విజయాన్ని నమోదు చేస్తాయి. రికార్డు వ్యూస్ తో ఛానల్ యజమానులకు లాభాల్ని తెచ్చిపెడతుంటాయి. మొన్న వచ్చిన చిన్న సినిమా “బలగం” మాటీవీ లో టెలికాస్ట్ అయ్యి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. కొన్ని రోజుల కిందటే  స్టార్ మా లో ప్రసారమైన ఈ సినిమా ఏకంగా 14.3 రేటింగ్స్ తో దుమ్ము లేపింది. చిన్న సినిమాల్లో దీనికే హైయెస్ట్ రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు మరో బ్లాక్ బస్టర్ సినిమా రెడీ అయ్యింది.

అదే విరూపాక్ష. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలై ఘన విజయం సాధించడమే గాక నిర్మాతకి 20కోట్ల వారికి లాబాల్స్ని తెచ్చిపెట్టింది. విరూపాక్ష సినిమాకి పని చేసిన టెక్నిషియన్స్ తో సహా నటీనటులందరికి ఈ సినిమా ద్వారా మంచి పేరు లభించింది. ఇక హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన విరూపాక్ష ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూటర్లకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక విరూపాక్ష ఈ ఆదివారం అనగా జూన్25 న మాటీవీ లో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది.

మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా టెలివిజన్ లోను బ్లాక్ బస్టర్ అవుతుందా? బలగం టిఆర్పి ఈ లక్ష్యంగా దిగుతున్న ఈ సినిమా భారీ రికార్డు నెలకొల్పేలా ఉంది. థియేటర్లో ప్రేక్షకుల్ని భయపెట్టించిన ఈ సినిమా టీవీల్లోనూ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని నెటిజన్లంటూన్నారు. ఇక విరూపాక్షకి అన్ని కలిసొస్తే 10 నుండి 15 లోపు టిఆర్పీ రేటింగ్ సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి చూద్దాం విరూపాక్ష బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు