Tollywood: అన్నపూర్ణ ఫోటో స్టూడియో.. 80స్ బ్యాక్డ్రాప్ తో వస్తున్నారు

టాలీవుడ్ లో ఈ మధ్య పాత కాలంలో 80స్ 90స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రావడం కామన్ అయిపొయింది. సార్, దసరా, కస్టడీ ఇలా చాలా సినిమాలు అవసరం లేకపోయినా సరే ఆకాలం నాటి అనుభూతుల్ని చూపించడంకోసం డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ సమయానికి సంబంధించిన కథాంశంతో కామెడీయే ప్రధానంగా లేటెస్ట్ గా ఒక సినిమా వస్తుంది.

“అన్నపూర్ణ ఫోటో స్టూడియో” అనే పేరుతో వస్తున్న ఈ సినిమాలో 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ వెబ్ సిరీస్ తో ఫేమస్ అయిన నటుడు చైతన్య రావు ఈ సినిమాలో హీరోగా నటిస్తునాడు. లావణ్య సాహుకార హీరోయిన్ గా నటిస్తుండగా అంతా కొత్త నటులే ఈ సినిమాలో అనిపించనున్నారు. రీసెంట్ గా డైరెక్టర్ మారుతి చేతులమీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. 80స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ నడుస్తుండగా హీరో ఒక ఫోటోస్టూడియో కి ఓనర్. తన స్టూడియో ను నడుపుకుంటూ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా లేదా? సినిమాలో దానికోసం ఏం చేసాడు అనేదే కథ. హీరోయిన్ ప్రేమ కోసం హీరో చేసే కామెడీ ఈ సినిమాలో హైలెట్ అవ్వనుంది.

- Advertisement -

ఇక ఈ సినిమాను “బిగ్బెన్ సినిమాస్” బ్యానర్ లో యష్ రాగినేని నిర్మిస్తుండగా, చందు ముద్దు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ప్రిన్స్ హెన్రీ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. టీజర్ కి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. దాంతో పాటు ఇంతకు ముందు ఈ సినిమానుండి విడుదలైన పాటలు కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ తిరు వర్క్ డీసెంట్ గా ఉంది. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని అన్నపూర్ణ ఫోటో స్టూడియో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు