Drug Mafia:సెలబ్రెటీలకు ఇదే రోగం… డ్రగ్స్ లేకపోతే బతకలేరా?

హీరోలు… హీరోయిన్లు… వీళ్లు సినిమాలకే పరిమితం కాదు. ప్రస్తుత రోజుల్లోనే హీరోలు, హీరోయిన్లు తో పాటు నటీనటులు కూడా సాధారణ ప్రేక్షకులకు, ప్రజలకు ఇన్స్పిరేషన్. వాళ్లు ఏం చేసినా, వాటిని ఫాలో అవ్వాలనే పిచ్చోల్లు చాలా మందే ఉన్నారు. ఈ విషయం ఆ సెలబ్రెటీలకు కూడా తెలుసు. తాము ఏం చేసినా, తమ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఫాలో అవుతారని. అయినా, కొంత మంది సెలబ్రెటీలు ఎంతకు దిగజారిపోతున్నారో.. ఈ మధ్య మనం చూస్తున్నాం.

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు… బాడీ స్ట్రక్చర్ పై ఫోకస్ పెట్టారు. ఆల్కహాల్ లాంటివి తీసుకోకుంటే బాడీ స్ట్రక్చర్ ను కాపాడుకోవడం కష్టం. కానీ, వీళ్లకు మత్తు కావాలి. దీంతో కొంత మంది సెలబ్రెటీలు డ్రగ్స్ ను వాడుతున్నారు.. వాటికి బానిసలు అవుతున్నారు.. పోలీసుల చేతికి చిక్కుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్స్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్.. అపై విచారణ తర్వాత సెలబ్రెటీలో డ్రగ్స్ తీసుకునే వారి గట్టు రట్టు అయింది. తన ఫోన్ కాల్స్ లో డ్రగ్స్ తీసుకునే సెలబ్రెటీల లిస్ట్ పెద్దగానే ఉందని తెలుస్తుంది. నిర్మాత కేపీ చౌదరి కొంత మంది పెర్లను కూడా బయటపెట్టారని టాక్.

అందులో భాగంగానే బిగ్ బాస్ ఫేం అషు రెడ్డి, నటి సురేఖ వాణి కూతురు తో పాటు చాలా మంది పేర్లు బయట వినిపిస్తున్నాయి. దీన్ని అషు రెడ్డి కొట్టిపారేసినా, నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం.. ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సార్లు ఇలాంటి వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల హడావుడిగా అరెస్టులు, విచారణలు. అపై యధావిధిగా డ్రగ్స్ కార్యకలాపాలు. కొన్నాళ్ల క్రిందట స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు కూడా డ్రగ్స్ కేసులో ఇరుక్కునారు. చాలా రోజుల పాటు విచారణ జరిగింది. విచారణ ఎదుర్కున్న వారంతా కూడా తాము ఎలాంటి తప్పు చేయలేదు అంటూ సొంత వివరణ ఇచ్చుకున్నారు.

- Advertisement -

కానీ ఇప్పటి వరకు ఆ కేసు తేలలేదు. ఇప్పుడు నిర్మాత కే పీ చౌదరితో మరోసారి వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం కూడా ఎన్ని రోజుల పాటు ఉంటుందో తెలియదు. ఎంత మందిని విచారిస్తారో తెలియదు. అలాగే ఎంత మంది శిక్ష పడుతుంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. దీంతో సినిమా రంగంలో డ్రగ్స్ వాడకాన్ని ప్రభుత్వాలు గానీ, పోలీసులు గానీ అరికట్టడం కష్టమే అని స్పష్టమవుతుంది. సెలబ్రెటీలే తెలుసుకుని, తమను చూసి మరికొంత మంది ఈ డ్రగ్స్ వ్యమోహంలో పడే ప్రమాదం ఉందని గుర్తించి డ్రగ్స్ ను బైకాట్ చేయాలే తప్పా.. మరే విధంగా ఇండస్ట్రీలో డ్రగ్స్ తగ్గలేవు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు