Ram Charan: తండ్రి బాధ్యత నెరవేర్చిన రామ్ చరణ్..!

మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ మధ్య రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ లో ఒక ఫైట్, సాంగ్ తో కూడిన గెస్ట్ రోల్ లో సల్మాన్ నటించటానికి ఇద్దరి మధ్య ఉన్న రిలేషనే కారణం. అడగగానే తన సినిమాలో గెస్ట్ రోల్ చేసినందుకుగాను చిరంజీవి సినిమా ప్రమోషన్స్ సమయంలో సల్మాన్ చేసిన ఫెవర్ ను ప్రస్తావిస్తూ చాలాసార్లు కృతఙ్ఞతలు తెలిపారు. అయితే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమా’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేయటం ఆసక్తికర అంశం.
సౌత్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తున్న ఈ సినిమాలో ఒక సాంగ్ లో వెంకటేష్ తో కలిసి సల్మాన్ ఖాన్ పంచెకట్టుతో ఫోజ్ ఇవ్వటం హైలైట్ గా నిలిచింది. వీరిద్దరితోపాటుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పంచకట్టులో మెరవటం అందరిని ఆకర్షిస్తోంది. అయితే గాడ్ ఫాదర్ లో చిరంజీవి కోసం సల్మాన్ చేసిన ఫెవర్ కు గాను రామ్ చరణ్ ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ చేసిన గెస్ట్ రోల్ ఆ సినిమాకు నార్త్ లో ఏ విధంగా కూడా హెల్ప్ అవ్వలేకపోయింది. కాగా, ఇప్పుడు సల్మాన్ కోసం రామ్ చరణ్ చేస్తున్న ఈ స్పెషల్ అపియరెన్స్ సౌత్ లో ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
ఇంకో పక్క సల్మాన్ ఖాన్ లుంగీ అవతారం గతంలో షారుఖ్ చేసిన లుంగీ డాన్స్ సాంగ్ ను గుర్తు చేస్తుంది. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా కూడా సౌత్ ఫ్లేవర్ తో వచ్చి బాగానే క్లిక్ అయ్యింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఒక అడుగు ముందుకేసి తన సినిమాలో తెలంగాణ నేటివిటీ అయిన బతుకమ్మ పండుగను కూడా వాడుకున్నాడు. మన తెలుగు సినిమాలు నార్త్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్న ఈ టైమ్ లో సల్మాన్ ఖాన్ మన తెలుగు ఫ్లేవర్ తో ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Celebrities Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు