Ravanasura: రవితేజ సినిమాకి A సర్టిఫికెట్.. అంత వైలెన్సా ?

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర అన్ని పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 2 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా కి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనెర్ గా వస్తున్న ఈ సినిమా కి సెన్సార్ బోర్డు క్లీన్ A సర్టిఫికెట్ ఇచ్చింది. 141 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా కు A సర్టిఫికెట్ రావడం చర్చనీయాంశం గా మారింది.

సాధారణంగా కంటెంట్ బోల్డ్ గా ఉన్న సినిమాలకు, లేదా వైలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలకు A సర్టిఫికెట్ ని ఇస్తారు. మరి రవితేజ నటించిన రావణాసుర మూవీ కి A సర్టిఫికెట్ ఎందుకొచ్చిందో చర్చనీయాంశం గా మారింది. ఈ మధ్యనే విడుదలైన అడవి శేష్ నటించిన “హిట్ ది సెకండ్ కేస్” సినిమా కి కూడా A సర్టిఫికెట్ వచ్చింది. అంటే అందులో కొంచెం వైలెన్స్ ఎక్కువ గా ఉంది కాబట్టి వచ్చింది. మరి రావణాసురలో ఏం అంత వైలెంట్ గా సీన్లు ఉన్నాయో తెలియదు. ట్రైలర్ ను చూసినా కూడా అందులో పెద్దగా హింసాత్మకం అనిపించేలా సీన్లు లేవు.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ ని జారీ చెయ్యలేదని ముందుగా సినిమాలో ని 30 కట్ లు చేస్తామని సినిమా టీమ్ కి చెప్పారు. అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా లోని కీలక మైన సీన్లు వాటితో లింక్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఆ సీన్లు కట్ చేస్తే సినిమా ఆడదని, A సర్టిఫికెట్ అయినా పరవాలేదు ఇమ్మని రావణాసుర టీమ్ కోరినట్లు చెప్పారు. అయితే దీన్ని చిత్ర యూనిట్ ఏమి పట్టించుకోకుండా తమ ప్రమోషన్ పనుల్లో బిజీ గా ఉన్నారు. ఏప్రిల్ 7న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు