Tollywood: టాలీవుడ్ అంటే మాస్ మసాలా మాత్రమేనా..? 

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు నార్త్ లో డిమాండ్ బాగా పెరిగింది. తెలుగు సినిమాలు చాలా వరకు హిందీలో డబ్ అయ్యి అక్కడ క్లిక్ అవ్వటం, యూట్యూబ్ లో కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ రావటం ఇందుకు నిదర్శనం. సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో మన తెలుగు సినిమాలు రీమేక్ చేసి గట్టెక్కిన పరిస్థితి చూశాం. ప్రస్తుతం సల్మాన్ నుండి వస్తున్న తాజా చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో కూడా చాలా వరకు మన తెలుగు ఫ్లేవర్ డామినేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మన మాస్ అండ్ యాక్షన్ సినిమాలు మినహా లవ్ స్టోరీస్ కానీ, కంటెంట్ ప్రధాన సినిమాలకు గానీ నార్త్ లో అంతగా ఆదరణ అందటం లేదు.

బాహుబలి తర్వాత ఒక్క RRR మినహాయిస్తే, పాన్ ఇండియా వైడ్ సక్సెస్ అయిన తెలుగు సినిమాలు చుసినా కూడా ఇదే అనుమానం రాక మానదు. పుష్ప వంటి మాస్ సినిమాలు హిట్ అవ్వటం, రాధే శ్యామ్ లాంటి లవ్ స్టోరీ ఫెయిల్ అవ్వటమే ఇందుకు కారణం. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలు చాలావరకు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొట్టాయి. ఇదే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ మన ఛత్రపతి రీమేక్ తో డైరెక్ట్ హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు దైర్యం ఇచ్చిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. నాని తాజా చిత్రం దసరా విషయం కూడా ఇందుకు మరో ఉదాహరణగా చెప్పొచ్చు.

నాని గత చిత్రాలన్నీ లవ్ స్టోరీస్ కావటం, అవేవి నార్త్ ఆడియెన్స్ కి రీచ్ కాకపోవటం దసరా సినిమాకు అక్కడ పెద్దగా కలెక్షన్స్ రాకపోవటానికి కారణం. మాస్ అయినా క్లాస్ అయినా మన సినిమాలకు నార్త్ లో డిమాండ్ పెరగటం మంచి విషయమే కానీ, కేవలం మాస్ సినిమాలు మాత్రమే హిట్ అవ్వటం, మిగతా సినిమాలకు అంతగా ఆదరణ అందకపోవటం వల్ల టాలీవుడ్ అంటే కేవలం మాస్ సినిమాలే అన్న రాంగ్ ఇండికేషన్ వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంపై మన ఫిలిం మేకర్స్ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు