Ram Charan: టాలీవుడ్ ‘CEO’

టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల సంఖ్య కాస్త పెద్దది గానే ఉంది. అందులో మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ అంటే.. RC15 అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ తో సినీ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకున్న రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం, వివైధ్యమైన సినిమాలను తెరకెక్కించే కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో రోజు రోజుకు బజ్ పెరిగిపోతుంది.

అలాగే ఈ సినిమా నుంచి వస్తున్న లీక్స్ తో.. RC15లో రామ్ చరణ్ రెండు పాత్రలు చేస్తున్నాడని, ఒక పాత్ర తండ్రి మరో పాత్ర కొడుకు అని తెలుస్తోంది. ఒక పాత్రలో రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో ప్రభుత్వ అధికారిక రామ్ చరణ్ కనిపించబోతున్నట్టు సమాచారం బయటకు వచ్చింది. దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.

అయితే సినిమా స్టార్ట్ చాలా రోజులు గడుస్తున్న టైటిల్ పై మాత్రం మూవీ టీం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇటీవల ఈ సినిమాకు సర్కారొడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా మరో టైటిల్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. CEO (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్) అనే టైటిల్ ను శంకర్, రామ్ చరణ్ అండ్ టీం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ పొలిటికల్ లీడర్ పాత్రతో పాటు ఎన్నికల అధికారి పాత్ర కూడా చేయబోతున్నాడట. ఈ క్రమంలోనే సినిమాకు CEO అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ న్యూస్ బయటికి రావడంతో రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీకి CEO లాంటోడని, ఆయన సినిమాకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని కామెంట్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు