Saindhav: వెంకీ మామకు జోడీగా హిట్ బ్యూటీ ?

స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా శైలేష్ కోలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైంధవ్ గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వెంకట్ బోయినపల్లి ఈ చిత్రానికి నిర్మాత కాగా, నవాజుద్దీన్ సిద్ధికి ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం కంటే ముందు వెంకేటష్ నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే, గత కొన్నేళ్లుగా ప్రతి సినిమాలోని ఒకే తరహా లుక్ మెయింటైన్ చేస్తున్న రానా నాయుడుతో పాటు సైంధవ్ సినిమాలో వెంకటేష్ హెయిర్ స్టైల్ వాడుతున్నట్టు తెలుస్తోంది.

ఇది వెంకటేష్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఓ కథనాయికగా రూహని శర్మని ఎంచుకున్నారు. రుహాని ‘చిలసౌ’ సినిమాలో నటిగా మెప్పించారు. అలాగే శైలేష్ దర్శకత్వం వచ్చిన “హిట్ 1” లో కూడా రుహని కథానాయికగా నటించింది.

- Advertisement -

సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో శైలేష్, రుహానిని రెండో సారి కథానాయికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరో హీరయిన్ గా ఇటీవల కేజీఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. ఇక మరో హీరోయిన్ గురించి తెలియాల్సి ఉంది.

ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ఇదేదో ట్రయాంగిల్ రొమాంటిక్ స్టోరీ అనుకుంటే పొరపాటేనని, ముగ్గురు కథలో భాగంగా వస్తారని, వెంకితో డ్యాన్సులు, రొమాన్స్ చేయడానికి కాదని చిత్ర వర్గాల నుంచి సమాచారం. సీరియస్ ఫేజ్ లో సాగే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్రలో నటిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు