World Famous Lover: కొండన్నకి కౌంటరేసిన ప్రొడ్యూసర్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?

World Famous Lover:

టాలీవుడ్ లో రౌడీ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి తో వచ్చిన స్టార్ డమ్ తర్వాత ఈ హీరో ఎలా మాట్లాడినా కొంచెం నెగిటివ్ గానే వైరల్ అవుతుందన్న సంగతి తెలిసిందే. కొన్ని సార్లు శృతి మించి మాట్లాడితే, మరో సారి పొరపాటున నోరు జారుతాడు. అలాంటి టైం లో కొన్ని మంచి మాటలు చెప్పినా ఆడియన్స్ కి నెగిటివ్ గానే అనిపిస్తుంది. అయినా విజయ్ దేవరకొండ కి పేరు వచ్చిందే ఇలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం వల్ల.

ఇకపోతే తాజాగా విజయ్ సమంత జంటగా నటించిన ఖుషి డీసెంట్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో రన్ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ కోసం కోటి రూపాయలు వినియోగిస్తున్నట్టు ప్రకటించాడు. ఫ్యాన్స్ లో ఆర్ధికంగా కష్టాల్లో ఉన్న 100 మందిని సెలెక్ట్ చేసి ఆ డబ్బును పంచుతానని అన్నాడు. ఈ విషయంపై ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేసారు. ఇలాంటి మంచి పనులు ఎంతో మందికి ఇన్స్పైర్ ని ఇస్తాయని సోషల్ మీడియా లో విష్ చేసారు.

అయితే ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ మాత్రం తమ సినిమాని ప్రస్తావిస్తూ విజయ్ కి సెటైర్ వేశారు. గతంలో విజయ్ దేవరకొండతో ఈ నిర్మాణ సంస్థ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయి భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా విజయ్ దేవరకొండ కోటి రూపాయల అనౌన్స్ మెంట్ గురించి అభినందిస్తూనే, వరల్డ్ ఫేమస్ లవర్ డిస్ట్రిబ్యూటర్లని కూడా ఇలాగే పెద్ద మనసుతో ఆదుకొమ్మని కౌంటర్ వేశారు .

- Advertisement -

దీనికి సోషల్ మీడియా లో రెండు రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. కొందరు నిర్మాతల తరపున న్యాయమైన విషయమే కదా అని సపోర్ట్ చేస్తుంటే, మరి కొందరు నెటిజన్లు ఇలాగే పెద్ద హీరోలకు అడిగే దమ్ముందా అని విజయ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ కి సపోర్ట్ కంటే సింపతీ ఎక్కువగా వస్తుందని కొందరు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు