SSMB28: ఆగిన మహేష్ త్రివిక్రమ్ సినిమా – క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో SSMB28 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మహేష్ బాబు షూటింగ్ ఆపమని త్రివిక్రమ్ కి చెప్పి మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తున్నాడని ఆ వార్తల సారాంశం. ఇటీవలే ప్రారంభమైన తమ హీరో షూటింగ్ అప్పుడే ఆగిపోయిందంటూ వార్తలు రావటంతో మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఆగిపోలేదంటూ తన ట్వీట్ తో రూమర్స్ కి చెక్ పెట్టాడు నాగవంశీ. ఆహరం కోసం వెతికే సమయంలో పక్షులు గట్టిగ శబ్దం చేస్తాయని, అలాగే ఎవరైనా తమ అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు ఇలాంటి గాసిప్స్ ని స్ప్రెడ్ చేస్తారని అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుర్తుండిపోయేలా ఈ సినిమా ఉండబోతుందని అన్నారు. మీరు వినాలనుకుంది వినండి కానీ, నా స్టేట్మెంట్ ని గుర్తు పెట్టుకోండి. గాసిప్ రాయుళ్లు రాసే వార్తల ప్రకారం సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఉపయోగకరంగా ఉంటుందేమో.

SSSMB28 కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది అంటూ ట్విట్టర్లో స్పందించి రూమర్స్ కి గట్టి సమాధానం ఇచ్చాడు.త్రివిక్రమ్, మహేష్ ల కాంబినేషన్లో వాస్తున్న మూడవ సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా మహేష్ ఈ సినిమాలో విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ తో, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో కనిపిస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి రానున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు