Akhil: అక్కినేని వారికి అచ్చిరాని జానర్ తో అఖిల్ ప్రయోగం – వర్కౌట్ అవుతుందా..?

అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో స్పై థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఏజెంట్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖిల్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం అంతా ట్రైలర్లో కనిపించింది, అఖిల్ కి ఈసారి తప్పకుండా బ్లాక్ బస్టర్ పడుతుంది అన్న నమ్మకం కలిగించింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి హైప్ క్రియేట్ అయిన ఈ సినిమాకి ఒక సెంటిమెంట్ భయం వెంటాడుతుంది. అదేంటంటే స్పై జానర్లో ఇప్పటివరకు నాగార్జున చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం.

స్పై థ్రిల్లర్ సినిమాలు వర్కౌట్ అవుతున్న తరుణంలో అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అచ్చి రాని స్పై జానర్ సెంటిమెంట్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. అఖిల్ కెరీర్లోనే మొదటిసారి స్పై థ్రిల్లర్ సినిమాలో నటించగా సురేందర్ రెడ్డి మార్క్ స్టైలిష్ టేకింగ్ తో ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుండి పలు మార్లు బ్రేక్ పడటంతో రిలీజ్ కూడా చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యింది.

ట్రైలర్ ముందు వరకు మినిమమ్ హైప్ కూడా లేని ఈ సినిమాకు ట్రైలర్ కావాల్సినంత హైప్ క్రియేట్ చేసింది. మరి తండ్రికి పెద్దగా కలిసి రాని జానర్లో ప్రయోగం చేస్తున్న అఖిల్ సక్సెస్ అందుకుంటాడా లేదా అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అటు అఖిల్ కెరీర్ కి, ఇటు సురేందర్ రెడ్డి కెరీర్ కి హిట్ కీలకమైన దశలో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు