Priyamani: పాపం ప్రియమణి.. ఇప్పటికీ ఆ టార్చర్ తప్పదా..?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ ప్రియమణి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో పాత్రలలో నటించి మరింత క్రేజ్ అందుకుంది. పలు సినిమాలలో బికినీలు కూడా ధరించి తన అందచందాలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది ప్రియమణి. కొన్ని సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది. అయితే వివాహమైన తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ప్రియమణి ఆ తర్వాత బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి ఢీ షో కి జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి పలు విభిన్నమైన పాత్రలలో నటిస్తోంది ప్రియమణి. తాజాగా ప్రియమణి గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
మైక్రోసాఫ్ట్ సీఈవో ముస్తఫా రాజ్ ని ప్రియమణి ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ప్రియమణి సినిమాలలో నటిస్తున్న సమయంలోనే చాలామంది హీరోలతో ఎఫైర్లు ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ వారిని మాత్రం వివాహం చేసుకోలేక పోయింది. ముస్తాపరాజ్ కి గతంలో వివాహమైనప్పటికీ కూడా తనని ప్రేమించి మరీ రెండవ పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి వివాహం జరిగిన సమయంలో.. ముస్తఫా రాజ్ మొదటి భార్య అఫీషియల్ గా ఆయనకు విడాకులు ఇవ్వలేదనే వార్తలు కూడా తరచూ వైరల్ గా మారుతూ ఉన్నాయి.
అయితే సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ప్రియమణి ఇప్పటికీ కూడా తన మొదటి భార్య నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమెకు ఇంకా పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుందని సమాచారం.ముస్తఫా రాజ్ మొదటి భార్యతో ప్రియమణికి నిజంగానే గొడవలు ఉన్నాయా అనే విషయంపై ఒక ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడడం కూడా జరిగిందట..
అయితే ఈ విషయం పైన ప్రియమణి మాట్లాడుతూ.. ముస్తఫా రాజ్ కి తన మొదటి భార్య నుంచి విడాకులు ఇచ్చి తనని వివాహం చేసుకున్నారని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ప్రియమణి మాత్రం నిజంగానే ఆమెతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది అనే వార్తలు కోలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటోంది ప్రియమణి. గతంలో కూడా ముస్తఫా రాజ్ నుంచి ఈమె విడాకులు తీసుకోబోతోంది అనే రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి. అయితే అందులో నిజం లేదని తెలియజేసింది ప్రియమణి.
Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు