Rajamouli : రాజమౌళి తండ్రి పారితోషకం ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా వరల్డ్ వైజ్ గా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన రాజమౌళి చివరిగా RRR సినిమాతో ఆయన రేంజ్ ని మార్చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కించే విధంగా సన్నహాలు చేస్తున్నారు. క్రేజ్ తో పాటూ రాజమౌళి రెమ్యునరేషన్ అలాగే సినిమాలలో వాటా కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా రాజమౌళి విజయానికి ముఖ్య కారణమని ఎన్నో సందర్భాలలో తెలియజేయడం జరిగింది. ఆయన అందించిన కథలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. ఇప్పటివరకు రాజమౌళి కెరియర్ లో ఫ్లాప్ అనేది లేదని చెప్పవచ్చు.. రాజమౌళి తన తండ్రికి ఒక్కో సినిమాకి స్క్రిప్ట్ అందించడానికి దాదాపుగా 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ స్థాయిలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ఇప్పటివరకు రైటర్ గా పేరు పొందిన వారు ఎవరు లేరని చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో ఆయన ప్రాజెక్టులు మరిన్ని సక్సెస్ అయ్యాయి అంటే ఈ రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈయన వయసు 81 సంవత్సరాలు . ఈ వయసులో కూడా తను ఇంత ఎనర్జిటిక్ గా సరికొత్త కథ లతో ప్రేక్షకులను మెప్పిస్తూ గర్వించదగ్గ సినిమా కథలను రాస్తూ ఉండడం గమనార్హం. ఈయన రాసిన కథలలో కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మరింత క్రేజ్ ను అందుకున్నాయి. ముఖ్యంగా ఈయన సినిమాలలో చాలా ట్విస్టులు కూడా ఉంటాయని చెప్పవచ్చు.

- Advertisement -

ఇక విజయేంద్ర ప్రసాద్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్లో స్క్రిప్టులను అందించి సరికొత్త కథాంశాలతో ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్ కలిగేలా చేస్తారని అభిమానులు తెలుపుతున్నారు.. కెరియర్ పరంగా ఈయన మరింత ఎదగాలని అభిమానులైతే కోరుకుంటున్నారు రోజురోజుకీ విజయేంద్ర ప్రసాద్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే విజయేంద్రప్రసాద్ కు తన కొడుకు రాజమౌళి కంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇష్టమని చాలా సందర్భాలలో తెలియజేశారు ఎందుకంటే.. కేవలం అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటారు. కనుక ఆ డైరెక్టర్ అంటే ఇష్టం ఉండడంతో పాటు తన మొబైల్ లో స్క్రీన్ డిస్ప్లే మీద కూడా పూరి జగన్నాథ్ ఫోటో ని పెట్టుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చూపించడం జరిగింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు