తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ జాతకాన్ని ఒక ఫ్రైడే మార్చేస్తుంది. మాములుగా కొన్ని సినిమాలు రిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్ సాధిస్తాయి.అలా మాములుగా వచ్చిన సినిమాల్లో కేజీఎఫ్ ఒకటి. 2018 లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ చిత్ర సీమనే ఆశ్చర్యపరిచే విధంగా బిగ్ హిట్ అందుకుంది. శాండిల్ వుడ్ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లను ప్రపంచానికి పరిచయం చేసింది.
దీనికి సీక్వెల్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్-2, ఏప్రిల్ 14న రిలీజైన విషయం తెలిసిందే. మూవీ ఏకంగా 1,200 కోట్ల కలెక్షన్లు రాబట్టి భారత చలన చిత్ర పరిశ్రమలోనే ప్రకంపనలు సృష్టించింది. దీని తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్” తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సలార్ షూటింగ్ స్టార్ట్ కాగా, ఎన్టీఆర్ తో చేయబోయే మూవీ ప్రకటన త్వరలో రాబోతుంది.
Read More: Pawan kalyan : సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా పై ఫ్యాన్స్ కు టెన్షన్
అయితే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబో మూవీ,. సలార్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టు ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసినట్టు సమాాచారం. అలాగే ఈ మూవీ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఈ మూవీ గురించి మరో క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ ఓ కీలక పాత్రలో లోక నాయకుడు కమల్ హాసన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఆయనను ఒప్పించే పనుల్లో ప్రశాంత్ నీల్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమైతే, ఎన్టీఆర్-కమల్ హాసన్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమే.
Read More: Priyanka Singh: ఒక్క నైట్ కి ఎంత..? నెటిజెన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రియాంక సింగ్..!
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...