Eagle: కన్ఫ్యూజ్ చేయకూడదనే మా ఉద్దేశ్యం – వివేక్ కూచిబొట్ల

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ‘ఈగల్’ ఒకటి. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేసారు. అయితే ఆ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సినిమా నిర్మాత ఈగల్ సినిమా తో పాటు మరో క్రేజీ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ మారుతి కాంబో లో రాబోతున్న ‘రాజా డీలక్స్’ సినిమా.

ఈ సినిమాని నిర్మిస్తుంది కూడా ఈగల్ సినిమా నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యే. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వివేక్ కూచిబొట్ల ఇంటర్వ్యూలో సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుతూ ‘ఈగల్’ సినిమా సంక్రాంతికి వస్తుందని మేము ముందుగానే అనౌన్స్ చేశాము. అయితే ప్రతి సంక్రాంతికి 3 లేదా 4 పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడగలిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ రిలీజ్ టైం దగ్గరికి వచ్చేసరికి దమ్మున్న సినిమాయే బరిలో నిలుస్తుంది.

ఇక ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ ప్రభాస్ – మారుతీ సినిమా గురించి సమయం వచ్చినప్పుడు గ్రాండ్ గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాము. అయితే ఇప్పుడు మా బ్యానర్లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో రాజా డీలక్స్ ఒకటి. అటు ప్రభాస్ కూడా పెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. కాబట్టి అభిమానులని కానీ ఆడియన్స్ ని కానీ కన్ఫ్యూజ్ చేయకూడదు. అందుకే సినిమా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నపుడు మేమె అనౌన్స్ చేస్తాము అని వివేక్ కూచిభొట్ల చెప్పడం జరిగింది. అయితే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం సలార్, కల్కి2898AD సినిమాలు రిలీజ్ అయ్యాకే రాజా డీలక్స్ పట్టాలెక్కుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు