Prabhas: ఆ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా – క్రేజీ కాంబినేషన్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో సలార్, ప్రాజెక్ట్ కె వంటి భారీ బడ్జెట్ సినిమాలతో పాటు మారుతీ డైరెక్షన్లో ఒక ఎంటర్టైనర్ సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ మరో క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానుందని అంటున్న ఈ సినిమా గురించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తవ్వాలి. అటు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

బాహుబలి తర్వాత యాక్షన్ సినిమాలకే ప్రిఫరెన్స్ ఇచ్చిన ప్రభాస్ సాహో సినిమాతో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత రాధేశ్యామ్ లాంటి లవ్ స్టోరీ, ఆదిపురుష్ లాంటి మైథలాజికల్ సినిమాతో డిజాస్టర్ చవిచూశాడు. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆశలన్ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సలార్ సినిమా మీదనే పెట్టుకున్నారు.

రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా ఆదిపురుష్ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టిందంటే ప్రభాస్ క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి. ఈ నేపథ్యంలో సలార్ సినిమా హిట్ అవ్వటం ప్రభాస్ కి కీలకంగా మారింది. ఇక తాజాగా వినిపిస్తున్న టాక్ గనక నిజం అయితే, యాక్షన్ సినిమాలతో నిండిన ప్రభాస్ లైనప్ లో హరీష్ శంకర్ సినిమా రిఫ్రెషింగ్ గా ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు