Tej: గీతా ఆర్ట్స్ తో తేజ్ – డైరెక్టర్ అతడేనా…?

విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుసగా తదుపరి సినిమాలను ఫైనలైజ్ చేస్తున్నాడు. ఆ మధ్య సంపత్ నందితో నెక్స్ట్ సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి, తాజాగా గీతా ఆర్ట్స్ తో తేజ్ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే, మిగతా విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గత కొంత కాలంగా స్పీడ్ తగ్గించిన అల్లు అరవింద్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్న నేపథ్యంలో తేజ్ తో సినిమా అన్న న్యూస్ మెగా అభిమానుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.

వినిపిస్తున్న టాక్ గనక నిజమే అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో తేజ్ – గీత ఆర్ట్స్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది ఉండచ్చని నెటిజన్లు అంటున్నారు. గీతా ఆర్ట్స్ కి ఉన్న సక్సెస్ రేషియో ని బట్టి చూస్తే మెగా మేనల్లుడికి మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అన్న సంకేతాలు వస్తున్నాయి.

ప్రస్తుతం తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి సముద్రఖని డైరెక్షన్లో నటించిన బ్రో సినిమా జులై 29న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆ మధ్య రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్ప్స్ ఆకట్టుకోవటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీమేక్ అయినప్పటికీ మంచి బజ్ క్రియేట్ అయిన ఈ సినిమా మామ అల్లుళ్లకు బ్లాక్ బస్టర్ అందిస్తుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు