Power Star: పవన్ కి మేనల్లుళ్ళ మీద ఉన్న ప్రేమ చెర్రీపై లేదా..?

చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అటు సినిమాల్లో ప్రత్యేకమైన స్టైల్ తో, ఇటు బయట అరుదైన వ్యక్తిత్వంతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సాధించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్వతహాగా మృదు స్వభావి అయిన పవన్ అతని సినిమా ఫంక్షన్స్ కి తప్పించి ఏ ఇతర ఫంక్షన్స్ లో కూడా కనిపించేవాడు కాదు. కానీ, రాజకీయాల్లోకి వచ్చాక పవన్ వైఖరిలో కొంచెం మార్పు వచ్చింది. తనకి కావాల్సిన వాళ్ళ సినిమాల ఈవెంట్స్ కి హాజరై తన సపోర్ట్ ఇవ్వటం మొదలు పెట్టాడు. శంకర్ దాదా సినిమాలో మినహా క్యామియో రోల్స్, గెస్ట్ అపియరెన్సెస్ ఇవ్వని పవన్ వెంకటేష్ తో కలిసి గోపాల గోపాల సినిమాలో నటించాడు.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని డైరెక్షన్లో వినోదాయ సీతాం రీమేక్ లో నటించాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సుధీర్ వర్మ డైరెక్షన్లో నటించబోయే సినిమాలో మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి ఛాన్స్ ఇచ్చాడని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కి మేనల్లుళ్ళ మీద ప్రేమ ఎక్కువ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం గతంలో సాయిధరమ్ తేజ్ కూడా పలు సందర్భాల్లో వెల్లడించాడు. చిన్నతనం నుండి పవన్ కళ్యాణ్ కి దగ్గరగా పెరిగానని, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో పవన్ దగ్గరుండి ట్రైనింగ్ తదితర విషయాలు చూసుకునే వాడని అన్నాడు. ప్రస్తుతం పవన్ ఇద్దరు మేనల్లుళ్ళకు ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే అది నిజమే అని ప్రూవ్ అవుతోంది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇంకో రకంగా చర్చ జరుగుతోంది. పవన్ కి మేనల్లుళ్ళ మీద ఉన్న ప్రేమ చెర్రీపై ఎందుకు లేదని కొందరు నెటిజన్స్ అంటున్నారు. చిరంజీవి, సురేఖలను అన్న, వదినలుగా కంటే అమ్మ నాన్నలుగా భావిస్తా అని చెప్పే పవన్ ఇంతకాలం చరణ్ తో కలిసి సినిమా ఎందుకు చేయలేదని అంటున్నారు. చరణ్ మీద కూడా సమానమైన ప్రేమ ఉండుంటే గనక వైష్ణవ్  తేజ్ కి ఇచ్చే రోల్ ఏదో రామ్ చరణ్ కి ఇచ్చి ఉండేవాడని అంటున్నారు. ఇది పక్కన పెడితే, రంగస్థలం సినిమా సమయంలో ప్రీరిలీజ్ ఫంక్షన్ కి హాజరైన పవన్ రామ్ చరణ్ ని తమ్ముడిలా భావిస్తా అని చెప్పిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా పలు ఇంటర్వ్యూల్లో కూడా రామ్ చరణ్ తో తనకి ఉన్న అనుబంధం గురించి చెప్పాడు కాబట్టి సినిమాలో కలిసి నటించినంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేనట్టు కాదని అభిమానులు గ్రహించాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు